ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ కోసం స్పెషల్‌ ప్రమోషన్స్‌..!

| Edited By:

Apr 05, 2020 | 5:01 PM

క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్‌కు ప్రమోషన్లను ప్రారంభించేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఉగాది రోజున మూవీ టైటిల్, మోషన్‌ పోస్టర్‌..

ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ కోసం స్పెషల్‌ ప్రమోషన్స్‌..!
Follow us on

క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్‌కు ప్రమోషన్లను ప్రారంభించేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఉగాది రోజున మూవీ టైటిల్, మోషన్‌ పోస్టర్‌.. చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరుతో ఓ స్పెషల్‌ వీడియోను విడుదల చేసిన చిత్ర యూనిట్.. త్వరలో మరో వీడియోను రిలీజ్ చేయబోతోంది. వచ్చే నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తోంది. దీనికి సంబంధించిన పనులను కూడా ప్రారంభించేసినట్లు ఫిలింనగర్‌లో టాక్‌. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఎన్టీఆర్ కోసం స్పెషల్ ప్రమోషన్లను చేయనుందట చిత్ర యూనిట్.

ఎందుకంటే దక్షిణాదిన స్టార్ హీరోగా పేరొందినప్పటికీ.. ఉత్తరాదిన ఎన్టీఆర్‌తో పోలీస్తే చెర్రీకే కాస్త క్రేజ్ ఎక్కువ. అక్కడ జంజీర్‌ సినిమాను చేశారు చెర్రీ. అది ఫ్లాప్‌ అయినప్పటికీ.. చరణ్‌కు అక్కడ మంచి క్రేజ్ వచ్చింది. అంతేకాదు బాలీవుడ్‌లోని పలువురు నటులతో చెర్రీకి మంచి అనుబంధాలు ఉన్నాయి. వీటితో పాటు చెర్రీ నటించిన చిత్రాలు యూట్యూబ్‌లో డబ్‌ అయ్యి మంచి వ్యూస్‌ను తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో చెర్రీకి అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మంచిగా ఏర్పడింది. కానీ ఎన్టీఆర్‌కు ఇలాంటి క్రేజ్‌ లేకపోగా.. చిత్ర యూనిట్ ప్రత్యేక ప్రమోషన్లను చేయనుందట. ఆ క్రమంలోనే మొన్న భీమ్‌ ఫర్‌ రామరాజు టీజర్‌లో ఎన్టీఆర్ వాయిస్‌ను హైలెట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే నెల రానున్న టీజర్‌లోనూ ఎన్టీఆర్‌ను మరింత హైలెట్ చేయబోతున్నట్లు టాక్.

కాగా ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్‌లో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Read This Story Also: ఆ ఆఫర్‌కు నో చెప్పేసిన బాలయ్య.. కారణమిదేనా..!