కాటుక కనులే.. మెరిసిపోయే పిలడా నిను చూసి… అని నగరి ఎమ్మెల్యే, సినీ హీరోయిన్ రోజా భర్త సెల్వమణితో కలిసి ఆడిపాడింది. ఎప్పుడు రాజకీయాలు, టీవీ షోలతో బిజీగా గడిపే రోజా కుటుంబానికి సమయం కేటాయిస్తుంటుంది.
నవంబర్ 17న రోజా తన పుట్టిన రోజును బంధువుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఆ సందర్భంగా భర్త, సినీ దర్శకుడు సెల్వమణితో పాటకు స్టెప్పులేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యింది. కాగా, వీడియోలో ఎమ్మెల్యే రోజా ఆకాశమే నీ హద్దురా సినిమాలోని కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి అనే పాటకు లయబద్ధంగా కాలు కదిపారు. వీడియోలో రోజా ఉత్సాహంగా డ్యాన్స్ చేయగా… ఆమె భర్త మాత్రం సిగ్గుపడుతూనే కాలు కదిపారు.
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :
GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..