హైదరాబాద్‌లో రాకీ భాయ్.. రామోజీఫిల్మ్ సిటీలో కేజీఎఫ్ చాఫ్టర్2 సినిమా షూటింగ్ షురూ..

|

Nov 26, 2020 | 5:59 PM

కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిన విషయమే. అందుకోసమే దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాఫ్టర్2' వస్తోంది. దీని షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.

హైదరాబాద్‌లో రాకీ భాయ్.. రామోజీఫిల్మ్ సిటీలో కేజీఎఫ్ చాఫ్టర్2 సినిమా షూటింగ్ షురూ..
Follow us on

కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిన విషయమే. అందుకోసమే దీనికి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ చాఫ్టర్2’ వస్తోంది. దీని షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకువస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్‌‌లో ప్రారంభమైంది. ఇందుకోసం రామోజీఫిల్మ్ సిటీలో భారీ సెట్ కూడా వేశారు.

ఈ సినిమాలో రాకీభాయ్‌‌‌గా కన్నడ హీరో యశ్ అందరిని అలరించారు. ప్రస్తుతం ఆయన బెంగుళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌ఫోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో యశ్ కెమెరాలకు చిక్కారు. ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకొని, నోటికి మాస్క్ పెట్టుకొని అదిరిపోయే హేర్‌స్టైల్‌తో కనిపించారు. దీంతో అభిమానులు యశ్.. యశ్ అంటూ ఎగబడి సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నారు. కాగా ఈ సినిమాలో పవర్‌పుల్ విలన్ క్యారెక్టర్‌ అధీరా పాత్రలో బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.