Devi Sri Prasad: మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మధ్యకాలంలో కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. గుబురు గడ్డంతో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్నాడు. లాక్‌డౌన్‌లో ఇంటి పట్టునే ఉంటున్న చాలా మంది గడ్డాలు పెంచినప్పటికీ.. ఆ తరువాత తీసేసుకున్నారు. కానీ దేవీ మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నారు. ఈ క్రమంలో ఈ మ్యూజిక్ మెజీషియన్‌కి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే బన్నీ ‘పుష్ప’లో దేవీ నటించబోతున్నాడని. (కరోనాకి వ్యాక్సిన్ రాకపోవచ్చు.. కీలక వ్యాఖ్యలు చేసిన బాలయ్య)
బన్నీ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప’ షూటింగ్ ఇటీవల మొదలైంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకీ దేవీ సంగీతం అందిస్తుండగా.. ఇందులో అతడు నటించనున్నాడని, అందుకోసమే గడ్డం పెంచుకున్నాడని తెలుస్తోంది. సుకుమార్, బన్నీ ఇద్దరూ దేవీకి మంచి స్నేహితులు. సుకుమార్ అయితే దేవీని తన ఆత్మతో పోలుస్తుంటారు. ఈ క్రమంలో దేవీని నటుడిగా చూడాలనుందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సుకుమార్.. ఇప్పుడు పుష్పలో అతడి కోసం ఓ పాత్రను ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకోసం రాక్‌స్టార్ ఈ కొత్త గెటప్ అని సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. (బాలయ్య-నాగశౌర్య మల్టీస్టారర్.. కాంబోను సెట్ చేసిన ప్రముఖ నిర్మాత..!)
కాగా సంగీత దర్శకుడిగా ఎన్నో హిట్ ఆల్బమ్‌లు ఇచ్చిన దేవీ.. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, అత్తారింటికి దారేది, ఖైదీ నంబర్.150, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాల్లోని పాటల్లో మెరిశారు. అలాగే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల కోసం రూపొందిన ప్రమోషనల్ పాటల్లో దేవీ-బన్నీ ఇద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. (ఇప్పుడు డెలివరీ బాయ్‌గా చేస్తున్నా.. నెదర్లాండ్ క్రికెటర్ పాల్ ఆవేదన )