
Shah Rukh Khan On Rinku Singh: బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ సోషల్ మీడియలో చాలా యాక్టీవ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. అలాగే సమయం ఉన్నప్పుడల్లా ట్విట్టర్ వేదికగా #AskSRK పేరుతో ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుంటాడు. ఆదివారం కూడా కింగ్ ఖాన్ ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ఆ సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ యువ ఆటగాడు రింకూ సింగ్ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు షారుఖ్ అందరినీ ఆశ్చర్యపరిచే సమాధానం ఇచ్చాడు. అది కూడా ఒక్క మాటలోనే. కింగ్ ఖాన్ ఇచ్చిన ఆ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు ఆ అభిమాని ఏం ఆడిగాడు..? షారుఖ్ ఏమని సమాధానం చెప్పాడు..? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆదివారం #AskSRK ట్యాగ్‌తో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు షారుఖ్ సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే శ్రేయాస్ ఆర్యన్ అనే ట్విట్టర్ యూజర్ ‘కోల్‌కతా నైట్ రైడర్స్ బచ్చా రింకూ సింగ్ గురించి ఒక్క మాటలో చెప్పండి’ అంటూ అడిగాడు. దానికి కింగ్ ఖాన్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ‘Rinku is Baaapppp!! Not bacha a!!’ అంటూ రిట్వీట్ చేశాడు. దీంతో ఇది కాస్త నెట్టింట చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. దీనిపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. అంతేనా ఈ చిన్న రిట్వీట్‌కి 11 లక్షల ఇంప్రెషన్స్, 20 వేల లైకులు వచ్చాయి.
Rinku is Baaapppp!! Not bacha a!! https://t.co/kyyKr4dJhy
— Shah Rukh Khan (@iamsrk) June 25, 2023
Rinku Singh And Shah Rukh Khan
కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో రింకూ సింగ్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసిన యష్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టి కేకేఆర్‌కి అనూహ్య విజయం అందించాడు. ఇంకా టీమిండియాలో స్థానం పొందేందుకు మార్గాలను ఏర్పాటుచేసుకున్నాడు. అంతేకాక సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఆసియా క్రీడలకు భారత్ బీ టీమ్‌లో రింకూ కూడా భాగం అయ్యే అవకాశం ఉంది.