సుశాంత్ కేసు.. రెండోసారి ఈడీ ముందు హాజరైన రియా!

బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో నటి రియా రెండోసారి ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఆమెతో పాటు తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి,

సుశాంత్ కేసు.. రెండోసారి ఈడీ ముందు హాజరైన రియా!

Updated on: Aug 10, 2020 | 1:52 PM

Sushant Case Updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో నటి రియా రెండోసారి ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఆమెతో పాటు తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, సోదరుడు సౌవిక్ చక్రవర్తి కూడా అధికారుల ముందుకు వెళ్లారు. కాగా సుశాంత్‌ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్లు అతడి తండ్రి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకొని విచారణను చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఓసారి రియా, సౌవిక్‌, సుశాంత్‌ స్నేహితుడు సిద్ధార్థ్‌ పితాని, మాజీ మేనేజర్ శృతి మోదీలను వారు విచారించారు. కాగా ఈడీ వర్గాల సమాచారం ప్రకారం వీరు పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే జూన్ 14న సుశాంత్‌ ముంబయిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయనది ఆత్మహత్య అని పోస్ట్‌మార్టంలో తేలినప్పటికీ, హత్య అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుండగా., రాజకీయంగానూ సుశాంత్ కేసు హాట్‌ టాపిక్‌గా మారింది.

Read This Story Also: స్వప్నా బెయిల్‌ పిటిషన్ కొట్టివేత

 

Loading...
Unable to load recommendations.
Follow Us