పాట పాడిన ఆధ్య.. పారిపోయిన అకీరా..!

లాక్‌డౌన్ నేపథ్యంలో సామాన్యులు సహా సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ముఖ్యంగా వరుస షూటింగ్‌లతో ఇన్ని రోజులు బిజీగా ఉన్న చాలా మంది ఇప్పుడు కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు.

పాట పాడిన ఆధ్య.. పారిపోయిన అకీరా..!

Edited By:

Updated on: Mar 29, 2020 | 6:03 PM

లాక్‌డౌన్ నేపథ్యంలో సామాన్యులు సహా సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ముఖ్యంగా వరుస షూటింగ్‌లతో ఇన్ని రోజులు బిజీగా ఉన్న చాలా మంది ఇప్పుడు కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. కొందరైతే వంట చేయడం, ఇంటి పనులు చేయడం లాంటివి చేస్తున్నారు. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటోన్న రేణు దేశాయ్.. ఫ్యాన్స్‌తో కాసేపు ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వడంతో పాటు.. కరోనా నేపథ్యంలో ఫ్యాన్స్‌కు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు.

ఈ క్రమంలో తన కుమార్తె ఆధ్యను కూడా రేణు లైన్‌లోకి తీసుకొచ్చారు. ఆ నేపథ్యంలో ఓ ఫ్యాన్స్ ఆధ్య చేత పాట పాడించండి అని రిక్వెస్ట్ చేశారు. తెలుగు, మరాఠీ, ఇంగ్లీష్‌ ఏ భాషలోనైనా ఆధ్యతో ఒక పాట పాడించండి అని కోరాడు. అందుకు ఆధ్య కొద్ది సేపు ఆలోచించినప్పటికీ.. ఆ తరువాత ఇంగ్లీష్‌ పాటను పాడారు. ఇక అకీరా నందన్‌ను కూడా చూపించిన రేణు.. అందరికీ హలో చెప్పమని కోరారు. కానీ అకీరా అక్కడి నుంచి పారిపోయారు. ఇక ఈ వీడియోలో కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించారు.

Read This Story Also: కరోనా కాలం.. పెళ్లిని వాయిదా వేసుకున్న టాలీవుడ్ హీరో..!