పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ సాధించాడు మహేష్. బ్యాంకు స్కాముల నేపథ్యంలో ఈ సర్కారు వారి పాట సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.
మహేష్ నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ వదినగా నటించనున్నట్లుగా సమాచారం. ఈ పాత్ర కోసం ఇప్పటికే చిత్రయూనిట్ రేణు దేశాయ్‌ని కూడా సంప్రదించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక బ్యాంకులో జరిగే అవినీతి, అక్రమాల గురించి ఈ సినిమా ఉండడంతో అలాంటి వాతావరణంలో ఎక్కువగా షూటింగ్ తీసే అవకాశం ఉంది. ఇందు కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా సెట్ వేసినట్లుగా సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read:
Pushpa Villain : ‘పుష్ప’ విలన్ విషయంలో ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్..బన్నీ అభిమానులకు ఫుల్ క్లారిటీ