కామ్రేడ్ భామ.. కోరుకునే హస్బెండ్ క్వాలిటీస్ ఇవే!

| Edited By: Srinu

Jul 23, 2019 | 2:43 PM

టాలీవుడ్‌లో వరుస హిట్స్ అందుకుని.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను ఆస్వాదిస్తోంది హీరోయిన్ రష్మిక మందన్నా. ఆమె.. హీరో విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్న రష్మిక తనకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనేది బయటపెట్టింది. తనను పెళ్లి చేసుకునే వాడు రొమాంటిక్‌గా ఉండాలని, తన భావాలను, ఇష్టాలను పంచుకునే వ్యక్తి కాకపోయినా ఫర్వాలేదు గానీ నిజాయితీగా మాత్రం ఉండాలని […]

కామ్రేడ్ భామ.. కోరుకునే హస్బెండ్ క్వాలిటీస్ ఇవే!
Follow us on

టాలీవుడ్‌లో వరుస హిట్స్ అందుకుని.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను ఆస్వాదిస్తోంది హీరోయిన్ రష్మిక మందన్నా. ఆమె.. హీరో విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్న రష్మిక తనకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనేది బయటపెట్టింది.

తనను పెళ్లి చేసుకునే వాడు రొమాంటిక్‌గా ఉండాలని, తన భావాలను, ఇష్టాలను పంచుకునే వ్యక్తి కాకపోయినా ఫర్వాలేదు గానీ నిజాయితీగా మాత్రం ఉండాలని అంటోంది రష్మిక మందన్నా. ఈమె 2018లో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్మెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పూర్తిగా కెరీర్‌పై ఫోకస్ పెట్టిన రష్మిక.. మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరూ’, నితిన్‌తో ‘భీష్మ’ అనే చిత్రాల్లో నటిస్తోంది.