అఖిల్ బాబూ.! ఈసారి మాటేమిటి.?

‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ కు ఇప్పటివరకు సరైన హిట్ దక్కలేదు. లేటెస్ట్ గా ఆయన నటించిన ‘మిస్టర్ మజ్ను’ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దాంతో అఖిల్ తన తరువాత సినిమా పై ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. అఖిల్ తన తర్వాత సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో హీరోయిన్ పాత్ర కోసం మొదట కియారా అద్వానీ ని సెలెక్ట్ […]

అఖిల్ బాబూ.! ఈసారి మాటేమిటి.?

Updated on: Apr 22, 2019 | 12:17 PM

‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ కు ఇప్పటివరకు సరైన హిట్ దక్కలేదు. లేటెస్ట్ గా ఆయన నటించిన ‘మిస్టర్ మజ్ను’ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దాంతో అఖిల్ తన తరువాత సినిమా పై ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. అఖిల్ తన తర్వాత సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో హీరోయిన్ పాత్ర కోసం మొదట కియారా అద్వానీ ని సెలెక్ట్ చేయగా.. ఆమె డేట్స్ ఎడ్జస్ట్ కాకపోవడంతో మరో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టిందట చిత్ర యూనిట్.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా ను తీసుకోనున్నారని సమాచారం. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే రెండవ వారం నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి.