Rashmika Mandanna: టాలీవుడ్ టాప్ హీరోయిన్ కు తక్కువ చిన్న హీరోయిన్‌కు ఎక్కువగా ఉండే బ్యూటీ రష్మిక మందాన. ఇప్పుడు అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది ఈ భామ. తెలుగు సినిమాల్లోనే కాకుండా ఇతర భాషల సినిమాల్లోనూ అవకాశాలు పట్టేసుకుంటూ మంచి మంచి ఆఫర్లతో దూసుకుపోతోంది. రష్మిక ఇప్పుడు అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలోనూ నటిస్తోంది.
ఇప్పటికే ఈ భామ తెలుగు,కన్నడంలో తన హవా కొనసాగిస్తుండగా తాజాగా బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తోంది. రష్మిక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. తన మొదటి హిందీ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా..? అని ఎదురుచూస్తున్న రష్మికకు ఆ టైం రానే వచ్చింది. ఫస్ట్ డే షూట్‌లో జాయిన్ అయ్యారు సిద్దార్థ్ మల్హోత్రా-రష్మిక. స్పెషల్ టీంతో మొదటి రోజు ప్రత్యేకమైనది అంటూ రష్మికతో కలిసి స్క్రిప్ట్ బుక్‌ను పట్టుకున్న స్టిల్ ను ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు సిద్దార్థ్ మల్హోత్రా. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
SIDHARTH MALHOTRA JOINS UNIT, BEGINS SHOOT… #SidharthMalhotra begins shoot for #MissionMajnu in #Lucknow today… Costars #RashmikaMandanna… Directed by Shantanu Bagchi… Produced by Ronnie Screwvala, Amar Butala and Garima Mehta. pic.twitter.com/02SAAPYsYb
— taran adarsh (@taran_adarsh) February 11, 2021