Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. తెలుగులో అగ్ర కథానాయకుల సరసన చోటు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవలే వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలు అమ్మడు రేంజ్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. వరస షూటింగ్స్ ఉండటంతో ఆమె ఎయిర్‌పోర్ట్‌ల వద్దే ఎక్కువ కనిపిస్తున్నారు. తాజాగా ఆమె హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు. అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లు ఫోటోలు, వీడియోలు తీస్తుంటే.. రష్మిక డ్యాన్స్ చేస్తూ లోపలికి వెళ్లిపోయారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రష్మికపై మండిపడుతున్నారు. రెండు హిట్లు వచ్చినంత మాత్రన అంత ఓవరాక్షన్ అవసరమా అని కామెంట్లు పెడుతున్నారు.
రష్మిక తెలుగులో నటించిన ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వరకు ఆమెను తెలుగు ఆడియెన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజ్ అయిన అనంతరం ఆమెకు నెగటీవ్ ఇమేజ్ బుల్డ్ అవుతోంది. మూవీలో మహేశ్ సరసన ఈ భామ ఓవరాక్షన్ చేసిందని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమా చూసిన చాలామంది పబ్లిక్ టాక్‌లోనూ ఇదే ఒపినియన్‌ను వ్యక్తపరిచారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన రష్మిక మూవీలో తన క్యారెక్టర్‌ని దర్శకుడు అలా డిజైన్ చేశాడని..ఓ నటిగా పాత్రకు తగినట్లుగా ఫెర్ఫామ్ చెయ్యడం తన వృత్తిగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ బెంగుళూరు బ్యూటి అల్లు అర్జున్‌కు జోడీగా ‘ఐకాన్’ సినిమాలో నటిస్తున్నారు.