టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కతుండగా..ఇందులో హీరోయిన్గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. ఈ సినిమాతర్వాత గోపీచంద్ దర్శకుడు తేజతో, అలాగే మారుతితో సినిమాలు చేస్తున్నాడు.
మారుతి, గోపిచంద్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ను ఖరారు చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. అందులో ఒకరు గ్లామరస్ హీరోయిన్ రాశిఖన్నా..మరోకరు వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బ నటిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 5నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఈషా రెబ్బా పాత్ర విభిన్నంగా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అక్టోబరు 1న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.
Also Read: