Ram Charan: మెగా పవర్ స్టార్ కు మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్.. ఏకంగా 264 కి.మీ పాదయాత్ర చేయడమే కాకుండా…

|

May 28, 2022 | 3:02 PM

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమాని ఒకరూ ఎవరూ చేయని పనిచేశారు. తన అభిమాన హీరోకి ఎప్పుడూ ఎవరూ ఇవ్వని వెరైటీ గిఫ్ట్‌ ఇచ్చి అందరినీ తనవైపుకు తిప్పుకున్నాడు. అతడు చేసి ప‌ని ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

Ram Charan: మెగా పవర్ స్టార్ కు మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్.. ఏకంగా 264 కి.మీ పాదయాత్ర చేయడమే కాకుండా...
Ram Charan
Follow us on

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమాని ఒకరూ ఎవరూ చేయని పనిచేశారు. తన అభిమాన హీరోకి ఎప్పుడూ ఎవరూ ఇవ్వని వెరైటీ గిఫ్ట్‌ ఇచ్చి అందరినీ తనవైపుకు తిప్పుకున్నాడు. అతడు చేసి ప‌ని ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. అతడు రామ్‌చరణ్‌ కోసం ఓ అందమైన, అద్భుతమైన గిప్ట్‌ ఇచ్చాడు. అది చూసిన పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మురిసిపోయాడు. తన అభిమాని ఇచ్చి మెమోరబుల్‌ గిఫ్ట్‌కు ఎంతో సంతోషపడ్డాడు. చ‌ర‌ణ్ ని చూసేందుకు, తను తెచ్చిన గిఫ్ట్‌ చరణ్‌కి అదించేందుకు గానూ ఏకంగా 264కిలోమీట‌ర్లు న‌డిచి వెళ్ళాడు జైరాజ్ అనే వ్య‌క్తి. తన పొలంలో పండించిన ధాన్యంతో రామ్ చరణ్ బొమ్మ గీశాడా వ్యక్తి.

ఏదైనా కొత్తగా చేస్తేనే నలుగురి మెప్పు పొందుతారన్నా విజయ సూత్రాన్ని నమ్మిన జైరాజ్ మెగాహీరోలకు వీరాభిమాని. చిన్నతనం నుంచి ఆర్ట్ పట్ల అభిరుచి పెంచుకున్నాడు. దాంతోనే తాను నచ్చిన మెచ్చిన మెగాస్టార్ శ్రీ రాంచరణ్ చిత్రాల్ని పొలాల్లో పండించి ఆకాశమంత అభిమానాన్ని చాటుకున్నాడు. మెగాపవర్ స్టార్ శ్రీ రాంచరణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆయన వరిచిత్రాల్ని పండించారు .గొర్లఖాన్ దొడ్డి పొలాల్లో రాంచరణ్ వరిచిత్రం అప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్‌చల్‌ చేసింది.

గద్వాల్ జిల్లా గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి ప్రాంతంలో పొలాల్ని కౌలుకు తీసుకుని రాంచరణ్ రిచిత్రాన్ని వేయడం ప్రారంభించాడు జైరాజ్. అంతెత్తునుంచి ఈ చిత్రాన్ని తీస్తే రాంచరణ్ చిత్తరువు స్పష్టంగా కనిపించేలా తీర్చిదిద్దాడు. ఇందుకోసం మూడునెలల పాటు శ్రమపడ్డాడు. చివరకు అనుకున్న విధంగా జైరాజ్ వరినాట్లేసి రామ్‌చరణ్‌ బొమ్మను చిత్రీకరించారు. ప్రతి పుట్టినరోజు నాడు కొత్తగా ఏదో చేసి అభిమాన హీరో కి అంకితం చేయాలన్న తపనతో ఉన్న జైరాజ్ అభిమాని అంటే ఇలా ఉండాలనే విధంగా తనని తాను తీర్చి దిద్దుకుంటున్నారు. తాజాగా పండిన వరి బియ్యంతో చరణ్‌ చిత్ర పటాన్ని గీశాడు. పండిన పంటను చరణ్‌కి అందజేయాలని తన ఊరినుంచి హైదరాబాద్ లో ని రాంచరణ్ ఇంటిదాకా 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి ఆయన్ని స్వయంగా కలుసుకున్నాడు. అమ్మ నాన్న లేని జైరాజ్‌ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రాంచరణ్ వరిచిత్రాన్ని పొలాల్లో పండించేందుకు వేల రూపాయలదాకా ఖర్చు చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న మెగా పవర్ రాంచరణ్ జైరాజ్‌ని తన నివాసానికి పిలిపించుకుని సుమారు 45 నిముషాలు మాట్లాడి అతనికి ఆర్థిక సహాయం చేయడమేగాక అతని మేధస్సుకు మెచ్చుకుని సినీపరిశ్రమలో తగిన స్తానం కల్పిస్తామని మాట ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా జైరాజ్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి నాకు ఇంత సప్పోర్ట్ చేస్తున్న శ్రీ రామ్ చరణ్ గార్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. చరణ్ నివాసంలో ఆయన్ను కలిసి బియ్యపు గింజలతో తాను వేసిన బొమ్మ గురించి వివరించి చెప్పాడు. ఆ అభిమానాన్ని ఆర్ట్ ను చూసి చరణ్ మురిసిపోయాడు.