RRR Movie updates: ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. నిజ జీవిత పాత్రలతో కూడిన ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించబోతున్నట్లు జక్కన్న ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇవి మాత్రమే కాదు ఇందులో వీరిద్దరు పలు పాత్రల్లో కనిపించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. బందిపోటులుగా, పోలీస్ ఆఫీసర్‌లుగా, సిఫాయిలుగా వీరిద్దరు నటించనున్నారట. ఒక్కో పాత్రలో ఒక్కో లుక్‌లో వీరు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరికి గురువుగా అజయ్ దేవగన్ నటించబోతున్నారు. ఇక ఇందులో రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలివియా, అజయ్ దేవగన్ సరసన శ్రియ కనిపించబోతున్నారు. 450 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Read This Story Also: సత్ప్రవర్తన.. 31 మంది రౌడీ షీటర్లకు విముక్తి