Rakul Preet Singh: వరుస హిట్స్‌కు బ్రేక్.. ఆ ఒక్క సినిమాతో చాలా టెన్షన్ పడ్డాను

సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు సహజం. ఒక్కోసారి భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడతాయి. అలాంటి ఓ భారీ బడ్జెట్ చిత్రం ఫెయిల్ అయినప్పుడు... ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఎప్పుడూ లేనంతగా బాధపడిందట! ఎన్నో ఆశలతో ఆ సినిమా రిజల్ట్​ ..

Rakul Preet Singh: వరుస హిట్స్‌కు బ్రేక్.. ఆ ఒక్క సినిమాతో చాలా టెన్షన్ పడ్డాను
Rakul Preet Singh

Updated on: Nov 27, 2025 | 6:55 PM

సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు సహజం. ఒక్కోసారి భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడతాయి. అలాంటి ఓ భారీ బడ్జెట్ చిత్రం ఫెయిల్ అయినప్పుడు… ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఎప్పుడూ లేనంతగా బాధపడిందట! ఎన్నో ఆశలతో ఆ సినిమా రిజల్ట్​ కోసం ఎదురుచూసిన హీరోయిన్​ ఒక్కసారిగా అంచనాలు తారుమారవడంతో ఒక్కసారిగా తన కెరీర్​ ప్రశ్నార్థకంగా మారిందంటూ వాపోయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్​? అది ఏ సినిమా?

టాలీవుడ్​లోకి ఏటా చాలామంది కొత్త హీరోయిన్లు వస్తూనే ఉన్నారు. సినీపరిశ్రమలో తెలుగు వాళ్లకంటే ముంబై, కన్నడ భామలదే హవా నడుస్తోంది. పాన్​ ఇండియా సినిమాలతో బాలీవుడ్ బ్యూటీలు కూడా టాలీవుడ్​ బాట పడుతున్నారు. ఈ పోటీ తట్టుకుంటూ అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్​ హీరోయిన్​గా రాణించడం ఒక ఛాలెంజ్​ అనే చెప్పాలి. అలాంటి పోటీని తట్టుకుని తనకంటూ ఓ ఇమేజ్​ క్రియేట్ చేసుకుని స్టార్​ హీరోల సరసన ఛాన్స్​లు కొట్టేసిన ఒక స్టార్ హీరోయిన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో దాచుకున్న బాధను బయటపెట్టింది.

తాను నటించిన ఓ సినిమా గురించి మాట్లాడుతూ ‘నాకు ఎప్పుడూ లేనంత బాధ కలిగింది’ అని చెప్పుకొచ్చింది. ఆ బాధ వెనుక ఉన్న కారణం… ఆ సినిమా సూపర్ స్టార్‌తో కలిసి చేసిన ప్రాజెక్ట్ కావడం, భారీ అంచనాలు కల్పించడం, కానీ ఫలితం ఊహించని విధంగా మారిపోవడం. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్!

రకుల్​ మాట్లాడింది సూపర్​స్టార్​ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘స్పైడర్’ (2017) సినిమా గురించి. ఎ.ఆర్. మురుగాదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కినా, బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. ‘ఆ సినిమా ఫలితం తర్వాత నా ఎక్స్‌పెక్టేషన్స్ పూర్తిగా కుప్పకూలాయి. ఎప్పుడూ లేనంత టెన్షన్, డౌట్స్… అన్నీ ఒక్కసారిగా వచ్చాయి’ అని రకుల్ తన బాధ పంచుకుంది.

Spyderr

అంతకు ముందు 8-9 వరుస హిట్స్ ఇచ్చిన రకుల్​కు ఈ ఒక్క ఫెయిల్యూర్​తో ఎంత గట్టి దెబ్బ తగిలిందో అర్థమవుతోంది. కానీ రకుల్ ఆ బాధను దాచుకోలేదు, దాన్ని లెసన్‌గా మార్చుకుంది. ‘ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్‌లో మరింత జాగ్రత్తగా ఉంటాను. ఒక్కో ప్రాజెక్ట్‌కు రెండుసార్లు ఆలోచిస్తాను’ అంటూ జాగ్రత్తగా కథలు ఎంచుకోవడం మొదలుపెట్టింది. సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు రెండూ సహజమే అని రుజువు చేస్తూ రకుల్ మళ్లీ ఫామ్​లోకి వచ్చి దక్షిణాదితోపాటు బాలీవుడ్​లోనూ రాణించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది.