Hero Rajini kanth: సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని ఆయన అభిమానులు ఆదివారం చెన్నైలో ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అభిమానుల ఆందోళనలపై స్పందిస్తూ తలైవి తన ట్విట్టర్ వేదికగా అభిమానులకు భావోద్వేగ లేఖ రాశారు.
“ఆరోగ్య పరిస్థితుల వలన నేను రాజకీయాల్లోకి రానని చెప్పాను. కానీ ఇప్పుడు నా నిర్ణయం మార్చుకోమని నాపై ఒత్తిడి చేయవద్దు అని రజినీ కోరారు. రాజకీయాల్లోకి రాకపోవడానికి గల కారణాలను నేను వివరంగా చెప్పాను. ఇప్పుడు ఇలాంటి ఆందోళనలు చేసి నన్ను బాధపెట్టొద్దు. నా నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ ఒత్తిడి తీసుకురావొద్దు. నేనూ మీ ఆందోళనతో చాలా బాధపడ్డాను. ఇప్పటికైన నన్ను అర్థం చేసుకోని ఆందోళనలు చేయకండి” అని లేఖలో పేర్కోన్నారు.
డిసెంబర్ మొదటి వారంలో రజినీ మార్పు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ జరగదు అంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు రజినీ ప్రకటించారు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యల వలన ఆయన హైదరాబాద్‌ని అపోలోలో చేరారు. చికిత్స అనంతరం తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తాడని ఎంతోకాలం నుంచి ఎదురు చూసిన ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన నిర్ణయాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలని రజినీ అభిమానులు ఆదివారం చెన్నైలో ధర్నా చేపట్టారు. దీంతో రజనీ ఆందోళనపై స్పందిస్తూ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
— Rajinikanth (@rajinikanth) January 11, 2021
Also Read: రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి.. పొలిటికల్ వేదికపై తారాతోరణం
సస్పెన్స్ విడుతుంది.. పార్టీ పై ప్రకటన.. సింబల్ ఏంటీ?.. తమిళనాట ఇదే పెద్ద చర్చ..