ప్రజలు దేవుడితో పాటు జగన్‌ ఫొటోను కూడా పెట్టుకుంటారు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సినీ నటుడు రాజా రవీంద్ర ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో జగన్‌ని మించిన బలమైన రాజకీయ నేత లేరని ఆయన అన్నారు.

ప్రజలు దేవుడితో పాటు జగన్‌ ఫొటోను కూడా పెట్టుకుంటారు

Edited By:

Updated on: Jul 28, 2020 | 10:31 AM

Raja Ravindra on YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సినీ నటుడు రాజా రవీంద్ర ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో జగన్‌ని మించిన బలమైన రాజకీయ నేత లేరని ఆయన అన్నారు. ఓ ఛానెల్‌లో మాట్లాడుతూ.. పలువురి గురించి ఆయన తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. జగన్‌తో సమానంగా ఉన్న నేతను అక్కడ ఇప్పట్లో చూడలేమని తెలిపారు. జగన్‌ ప్రభుత్వాన్ని నడిపించే తీరు, సంక్షేమ పథకాల నిర్వహణను చూస్తుంటే.. ప్రతి ఒక్కరు తమ ఇంట్లో దేవుడి ఫొటోతో పాటు ఆయన ఫొటోను పెట్టుకునే రోజు కచ్చితంగా వస్తుందని జోస్యం చెప్పారు. ఆరోగ్యం, విద్యపై ఆయన పెడుతున్న పథకాలు చాలా బావున్నాయని,  ఏ ప్రభుత్వాలు వాటిపై ఆలోచించలేదని, కానీ జగన్ ఆ రెండింటి మీద దృష్టి పెట్టడం నిజంగా ఆనందించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఇక దేశ వ్యాప్తంగా జగన్‌కి గుర్తింపు లభిస్తుందని రాజా రవీంద్ర వెల్లడించారు. అంత చిన్న వయస్సులో ఓ వ్యక్తి పోరాడి, సీఎంగా గెలవడం అన్నది అంత ఈజీ కాదని.. కచ్చితంగా ఓ గొప్ప నేతగా జగన్ గుర్తుండిపోతారని తెలిపారు.

ఇక మెగాస్టార్‌ గురించి చెబుతూ.. ”చిరంజీవి గారితో ప్రతి నిమిషం కొత్తగా ఉంటుంది. నేను ఆయనతో 10 సంవత్సరాల పాటు ప్రయాణం చేశాను. ఏ రోజూ, ఏ నిమిషం ఆయనతో నాకు బోర్ కొట్టలేదు. చిరంజీవితో ఉంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. నా కెరీర్‌లో చాలా మందిని కలిశాను. కానీ చిరంజీవి గారితో ఉన్నప్పుడు కలిగే ఎగ్జైట్‌మెంట్‌ వేరు. ఆయన ఙ్ఞాపకశక్తికి చేతులెత్తి దండం పెట్టొచ్చు” అని చెప్పుకొచ్చారు.

Read This Story Also:ఏపీఎస్‌ఆర్టీసీలో 670 మందికి కరోనా