Radhika: జీవితంలోని మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న అలనాటి అందాల తార.. నిన్ను ప్రేమిస్తున్నానంటూ ట్వీట్‌..

Radhika Post About Her Marriage Life: తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి రాధిక శరత్‌ కుమార్‌. తమిళంతో పాటు తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించింది...

Radhika: జీవితంలోని మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న అలనాటి అందాల తార.. నిన్ను ప్రేమిస్తున్నానంటూ ట్వీట్‌..

Updated on: Feb 05, 2021 | 5:27 AM

Radhika Post About Her Marriage Life: తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి రాధిక శరత్‌ కుమార్‌. తమిళంతో పాటు తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించింది.
రెండు ఇండస్ట్రీలకు చెందిన దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడిన రాధిక.. ప్రస్తుతం సీరియళ్లలో నటిస్తూ ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇక రాధిక వైవాహిక జీవితం విషయానికొస్తే సహనటుడు శరత్‌ కుమార్‌ను 2001లో వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు సంతానం. ఇదిలా ఉంటే తాజాగా రాధిక పెళ్లి రోజు సందర్భంగా (ఫిబ్రవరి4) తన వివాహ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది. భర్తతో కలిసి దిగిన కొన్ని అందమైన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది రాధిక. ఈ ఫొటోలతో పాటు.. ‘గొప్ప స్నేహితులు, విధి మమ్మల్ని ఒక్కటి చేసింది. నువ్వు నా వాడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ క్యాప్షన్‌ జోడించింది. ప్రస్తుతం రాధిక చేసిన పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read: Thalapathy Vijay: దళపతి విజయ్ మీదున్న వీరాభిమానంతో ఈ యువతి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..

Follow Us