Radha Ravi Comments on Nayanthara: సీనియర్ నటుడు, తమిళనాడు బీజేపీ నేత రాధారవి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యువ హీరో, డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌తో హీరోయిన్ నయనతారతో ఎఫైర్ ఉందంటూ తాజాగా ఓ ఎన్నికల ప్రచార సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు హాట్‌టాఫిక్‌గా మారాయి.
రెండేళ్ల కిందట ఓ ఆడియో లాంచ్‌లో హీరోయిన్ నయనతారపై వ్యాఖ్యలు చేసి డీఎంకే నుంచి సస్పెండైన రాధారవి.. ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరారు. కొద్ది నెలల కిందట ఆయన బీజేపీలో చేరారు. లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగిన నయనతార మీద ఇప్పటివరకు ఎవరు నెగటివ్ కామెంట్స్ చేయలేదు. కాని తమిళ నటుడు, బీజేపీ స్టార్ క్యాపెనర్ రాధారవి అనూహ్యంగా నయనతార మీద తన వ్యంగాస్త్రాలు సంధించాడు.
తమిళనాడులో రాజకీయాలకు సినిమాలకు దగ్గర సంబంధాలు ఉన్న విషయంలో తెలిసిందే.. ఈ ఎన్నికల్లో సైతం చాలా మంది సినిమా వాళ్లు ఎన్నికల బరిలో నిలిచారు. అలాగే, చాలా మంది సినిమా ప్రముఖులు పార్టీల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న రాధారవి తాజాగా ఓ ప్రచార సభలో పాల్గొని.. నయనతారకి డీఎంకేకి ఉన్న సంబంధమేంటని ప్రశ్నించారు. నయనతారతో ఉదయనిధి స్టాలిన్‌కి ఎఫైర్ ఉందని.. ఆ విషయం మాట్లాడినందుకే తనను డీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారని రాధారవి చెప్పుకొచ్చారు. అంతటితో అగకుండా, నయనతారతో ఉదయనిధి స్టాలిన్ సహజీవనం చేస్తున్నాడని, అయినా అలాంటివి తాను పట్టించుకోనని వ్యాఖ్యానించాడు. తాజాగా డీఎంకే నేత, ఎంపీ ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
ఇక, ఎంఎన్‌ఎం అధినేత కమల్ హాసన్‌పై కూడా రాధారవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీకి కమల్‌కి చాలా తేడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ దేశాన్ని కాపాడితే.. కమల్ కట్టుకున్న భార్యలను కూడా కాపాడుకోలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు మహిళ జీవితాలను రోడ్డుపాలు చేశారని ఆయన ఆరోపించారు. రాధారవి కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
మరోవైపు, రాధారవి చేసిన వ్యాఖ్యలపై డీఎంకే శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా, కోలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా రాధారవి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, ఏప్రిల్ 6న ఒకే దశలో తమిళనాడు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ తన తాత కంచుకోట చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఇదిలావుంటే, గతంలో ఓ ఆడియో ఫంక్షన్‌లోనూ రాధారవి నయనతారపై అనుచితవ్యాఖ్యలు చేశారు. దెయ్యంగానూ.. సీత గాను ఒకేసారి నటించే సత్తా నయనతారకు ఉందని.. ఒకప్పుడు కే.ఆర్ విజయ లాంటి వారికి అలాంటి ఛాన్స్ ఉందని నయనతారను దెప్పిపొడించాడు. అంతేకాకుండా చూపులతో వలలో వేసుకునే వారికి ఇప్పుడు దేవతల పాత్రలు ఇవ్వడానికి దర్శకులు వెనుకడుగు వేయట్లేదని అన్నాడు. రాధారవి వ్యాఖ్యలను ఖండిస్తూ సింగర్ చిన్మయి, వరలక్ష్మి శరత్ కుమార్, దర్శకుడు విఘ్నేష్ శివన్ నడిఘర్ సంఘంపై కామెంట్స్ చేశారు. హీరో విశాల్ జోక్యం చేసుకుని రాధా రవి మాటలు ఆయన కామెంట్స్ ను ఖండిస్తూ ప్రకటనలు చేశారు.
కాగా, నడిగర్ సంఘం రాధా రవి వ్యవాహారంపై సీరియస్ అయ్యింది. ఎన్నికల టైం కావడం వల్ల రాధా రవి వ్యాఖ్యల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని గతంలోనే డి.ఎం.కే పార్టీ నుండి ఆయన్ను సస్పెన్స్ చేసింది. దీంతో భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. తాజా కామెంట్‌పై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.