Rocketry: ఇస్రో ప్రయోగాలకు.. పంచాంగానికి ముడిపెట్టిన హీరో మాధవన్‌.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..

|

Jun 26, 2022 | 6:00 AM

మాధవన్‌ తొలిసారి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా జులై 1న విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ మాధవన్‌ నెటిజన్ల నోట్లో పడ్డాడు.

Rocketry: ఇస్రో ప్రయోగాలకు.. పంచాంగానికి ముడిపెట్టిన హీరో మాధవన్‌.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..
R Madhavan
Follow us on

R Madhavan gets trolled: సినీ హీరో, ఇప్పుడు డైరెక్టర్‌గా మారిన మాధవన్‌పై సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. నోరు జారావంటూ నెటిజన్లు మాధవన్‌ను ఏకిపారేస్తున్నారు. సైంటిఫిక్‌ విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడితే ఏమవుతుందో మాధవన్‌ ఎపిసోడ్‌ ఓ ఎగ్జాంపుల్‌ అంటున్నారు. మాధవన్‌ తొలిసారి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ (Rocketry: The Nambi Effect) సినిమా జులై 1న విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ మాధవన్‌ నెటిజన్ల నోట్లో పడ్డాడు. దీనికి కారణం అతను చేసిన వ్యాఖ్యలే. అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించేందుకు, అంగారకుడి కక్ష్యలోకి అది చేరుకునేందుకు ఇస్రోకు పంచాంగం సాయపడిందన్నారు మాధవన్. పంచాంగం చూసి పెట్టిన ముహూర్త బలంతో భారత్ మార్స్ మిషన్ అవాంతరాలను దాటిందన్నారు. గ్రహ గతులన్నీ పంచాంగంలో నిక్షిప్తమై ఉంటాయన్నారు. ఈ వ్యాఖ్యలతో మాధవన్‌ను నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఈ వ్యాఖ్యలపై సైన్స్‌పై అవగాహన ఉన్న వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మాధవన్‌ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. సైన్స్ గురించి తెలియకపోయినా పర్వాలేదు కానీ, ఏవి ఎలా పనిచేస్తాయో తెలియనప్పుడు నోరు విప్పకపోవడం మంచిదని ఓ యూజర్ మాధవన్‌కు సలహా ఇచ్చాడు. ‘మరీ ఇంత మూర్ఖత్వమా?’ అని మరో యూజర్ కోప్పడ్డాడు. మాధవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ఇంకొందరు అన్నారు.

‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాను మాజీ శాస్త్రవేత్త, ఇస్రో ఏరోస్పేస్ ఇంజినీర్ నంబి నారాయణ జీవిత కథ ఆధారంగా తీశారు. నంబి నారాయణపై అప్పట్లో గూఢచర్యం ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆయన క్లీన్‌చిట్‌తో బయటపడ్డారు. ఈ సినిమాలో మాధవన్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.