సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేసింది మూవీ యూనిట్. ఇందులో భాగంగా ఆ మధ్యన టీజర్‌ను విడుదల చేసిన సాహో టీం.. తాజాగా సైకో సాయన్ అనే పాట టీజర్‌ను రిలీజ్ చేసింది. అందులో బాలీవుడ్ బీట్లతో కేక పుట్టిస్తోంది. అలాగే ప్రభాస్ లుక్, శ్రద్ధా అందచందాలు బావున్నాయి. ఇక ఈ పాటకు తనిష్క్ బాగ్చీ సంగీతం అందించగా.. శ్రీజో సాహిత్యం అందించారు. ద్వానీ బనుసాలీ పాటను పాడారు.
కాగా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటించగా.. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.