
‘టిల్లు స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాడు. విడదులైన తొలి షో నుంచే సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ‘డీజే టిల్లు’ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చిన సీక్వెల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సిద్ధు జొన్నలగడ్డ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తనదైన కామెడీ డైలాగ్స్, యాటిట్యూట్ యాక్టింగ్‌తో యూత్‌ను థియేటర్లకు రప్పిస్తున్నాడు. షో షోకి కలెక్షన్లు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఓవరాల్‌గా రూ. 27 కోట్ల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్‌సీస్‌లోనూ టిల్లు వసూళ్ల సునామి కురిపిస్తోంది. ఇప్పటికే చిత్ర నిర్మాత నాగవంశీ ఈ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
ఇక టిల్లు స్క్వేర్‌కు కొనసాగింపుగా మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా నాగవంశీ తెలిపారు. దీంతో టిల్లు ఫ్యాన్స్‌లో మూడవ పార్ట్ ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటి నుంచే క్యూరియాసిటీ పెరిగిపోయింది. స్టోరీ ఎలా ఉండనుంది.? హీరోయిన్ ఎవరు అని ఇప్పుడే ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే తాజాగా ఇదే విషయమై నిర్మాత నాగవంశీ ఓ హింట్ ఇచ్చారు. టీవీలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో సిద్ధు, నిర్మాత నాగవంశీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే టిల్లు మూడో పార్ట్ గురించి కీలక విషయాన్ని తెలిపారు. ఈ విషయమై నాగవంశీ మాట్లాడుతూ.. ‘టిల్లు పాత్ర నుంచి ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.టిల్లు క్యూబ్‌లో కచ్చితంగా టిల్లు పాత్రను సూపర్ హీరో చేద్దామనలో ఆలోచనలో ఉన్నాము’ అని చెప్పుకొచ్చారు. ఇక హీరో సిద్ధు మాట్లాడుతూ.. టిల్లు పాత్రను ఒక సూపర్ హీరోగా చూపిద్దామనే ఆలోచనలో ఉన్నాడని తెలిపారు. మరి డీజే టిల్లు మూడవ పార్ట్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..