‘శ్రీదేవి బంగ్లా’ కొత్త టీజర్ విడుదల..!

|

Mar 16, 2019 | 6:58 PM

కన్నుగీటి.. కుర్రకారును తనవైపుకు తిప్పుకుంది మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ‘శ్రీదేవి బంగ్లా’ చిత్రంతో ఆమె బాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రశాంత్ మాంబుల్లి దర్శకుడు. ఈ సినిమాలో ప్రియ.. శ్రీదేవి అనే నటి పాత్ర పోషిస్తుండగా, ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అంతేకాదు ట్రైలర్ లో ప్రియ బాత్ టబ్ లో పడి ఉండడం చూసి నటి శ్రీదేవి నేపథ్యంలో దీన్ని […]

శ్రీదేవి బంగ్లా కొత్త టీజర్ విడుదల..!
Follow us on

కన్నుగీటి.. కుర్రకారును తనవైపుకు తిప్పుకుంది మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ‘శ్రీదేవి బంగ్లా’ చిత్రంతో ఆమె బాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రశాంత్ మాంబుల్లి దర్శకుడు. ఈ సినిమాలో ప్రియ.. శ్రీదేవి అనే నటి పాత్ర పోషిస్తుండగా, ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అంతేకాదు ట్రైలర్ లో ప్రియ బాత్ టబ్ లో పడి ఉండడం చూసి నటి శ్రీదేవి నేపథ్యంలో దీన్ని తీశారనే భావన కూడా ప్రేక్షకులలో కలిగింది. ఈ నేపథ్యంలో బోనీ కపూర్ చిత్ర బృందానికి నోటీసులు కూడా ఇచ్చాడు.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రెండో టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ‘నాకు ఎంత మంది ప్రపోజ్ చేశారో నీకు తెలుసా.? అనే డైలాగు తో టీజర్ స్టార్ట్ కాగా ‘ప్రపంచం మొత్తం నీ నగ్న జీవితాన్ని చూస్తుంది శ్రీదేవి’ అనే డైలాగుతో టీజర్ ఎండ్ అవుతుంది. అంతేకాదు ఈ టీజర్ తో సినిమాపై ఆసక్తి పెంచారని చెప్పాలి.