ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌కి కరోనా పాజిటివ్‌

మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌కి కరోనా సోకింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌కి కరోనా పాజిటివ్‌

Updated on: Oct 20, 2020 | 1:24 PM

Prithviraj Corona Positive: మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌కి కరోనా సోకింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ నటుడు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల ఈ నటుడు జన గణ మన అనే మూవీ షూటింగ్‌లో పాల్గొనగా.. అక్కడే వైరస్ సోకింది. ప్రస్తుతం పృథ్వీరాజ్‌కి ఎలాంటి లక్షణాలు లేనట్లు సమాచారం.

కాగా లాక్‌డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో ఇటీవల షూటింగ్‌లు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ జన గణ మన మూవీ షూటింగ్‌ని ఎర్నాకులంలో ప్రారంభించారు. అక్కడ పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉండగా.. ఈ మూవీ దర్శకుడు డిజో జోస్‌కి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో షూటింగ్‌ని ఆపేశారు. ఇక ఇందులో పృథ్వీరాజ్‌తో పాటు సూరజ్ వెంజరమోదు పాల్గొనగా.. అతడి ఫలితాలు రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఆడు జీవితం అనే మూవీ షూటింగ్ కోసం జోర్దాన్‌కి పృథ్వీరాజ్ వెళ్లిన సమయంలో.. ఇక్కడ లాక్‌డౌన్ విధించారు. దీంతో దాదాపుగా రెండు నెలల పాటు ఆ మూవీ టీమ్‌ అక్కడే ఉండిపోయింది. ఇక ఇక్కడకు వచ్చిన తరువాత జరిపిన పరీక్షల్లో.. అందులోని ఇద్దరికి పాజిటివ్‌గా తేలగా.. పృథ్వీకి నెగిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.

Read More:

కాజల్‌ పెళ్లికి వెళ్లనున్న టాలీవుడ్ యంగ్ హీరో..!

ఇటాలియన్ పిల్లలతో ప్రభాస్.. వీడియో వైరల్‌

Loading...
Unable to load recommendations.
Follow Us