
నవరస నాట సార్వభౌమ కైకాల సత్యనారాయణ ఇవాళ 85వ పుట్టినరోజును జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, కైకాలకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లడించారు. మమ్మల్ని ఇలానే గైడ్ చేస్తూ ఉండండి అని ప్రశాంత్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా మరో గుడ్‌న్యూస్‌ను వెల్లడించారు ఈ దర్శకుడు. త్వరలోనే కేజీఎఫ్ చాప్టర్ 2 అప్‌డేట్ ఉంటుందని ప్రశాంత్ తెలిపారు. కాగా కేజీఎఫ్‌ను తెలుగులో కైకాల సమర్పించగా.. ఆయన తనయుడు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇదిలా ఉంటే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానున్న కేజీఎఫ్ 2పై అన్ని ఇండస్ట్రీల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో యశ్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండెన్, రావు రమేష్, శరన్ శక్తి, మాలవిక అవినాష్ తదితరులు నటించారు.
Thank u for everything kaikala satyanarayana garu?continue to guide us. pic.twitter.com/XDZdyelcXq
— Prashanth Neel (@prashanth_neel) July 25, 2020