
కరోనాతో ప్రపంచవ్యాప్తంగా షూటింగ్‌లకు బ్రేక్ పడ్డ విషయం తెలిసిందే. రోజు రోజుకు ఈ మహమ్మారి విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు మొదలవుతాయన్న ప్రశ్నకు సమాధానం ఎవ్వరికీ తెలీదు. ఈ క్రమంలో చాలామంది దర్శకనిర్మాతలు చాలా టెన్షన్ పడుతున్నారు. వారిలో దర్శకుడు రాధాకృష్ణకుమార్ ఒకరు. జిల్ తరువాత ప్రభాస్‌తో సినిమాను ప్రకటించిన ఈ దర్శకుడు.. 2018లో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. అయితే ఆ మధ్యలో సాహో కోసం కూడా ప్రభాస్ డేట్లు కేటాయించడంతో.. ఈ సినిమా చిత్రీకరణలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఇక ఈ ఏడాది ఎలాగైనా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన దర్శకుడు.. అందుకు అనుగుణంగా షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా రూపంలో ఈ సినిమాకు మరో అడ్డంకి తగిలింది.
ఈ క్రమంలో రాధాకృష్ణ కుమార్ టెన్షన్ పడుతున్నారట. సినిమా విడుదల విషయంలో అభిమానుల నుంచి ట్రోల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అతడు బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట. అయితే ఈ విషయం తెలిసిన ప్రభాస్, ఎలాంటి ఇబ్బంది పడొద్దని ఆ దర్శకుడికి భరోసా ఇచ్చారట. సినిమా విడుదల విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారట. కాగా రొమాంటిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. గోపికృష్ణ బ్యానర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.
Read This Story Also: లాక్‌డౌన్ లేకుండానే చైనా పక్కనున్న ఆ దేశం కరోనాను ఎలా జయించిందంటే..!