ప్రముఖ కథానాయకుడు మహేశ్ బాబు ( Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారని అన్నారు. ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు, గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయమని చెప్పారు. తండ్రి కృష్ణ నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ ఆయన బాటలో దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. అర్జున్ సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి మహేశ్ బాబు తన గళం వినిపించినప్పుడు ఆయనకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిచామని చెప్పారు. జల్సా సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు మహేశ్ బాబు నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు త్రివిక్రమ్ గారు కోరగానే అంగీకరించారని గత అనుభవాలను వెల్లడించారు. కథానాయకుడిగా తనదైన పంథాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న మహేశ్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ప్రముఖ కథానాయకులు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేపట్టే సేవా కార్యక్రమాలు… హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. – Sri @PawanKalyan (1/4)
ఇవి కూడా చదవండి— JanaSena Party (@JanaSenaParty) August 9, 2022
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు నేడు సందర్భంగా సినిమా తారలు, పలువురు ప్రముఖులు మహేశ్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇటీవల కాలంలో మహేశ్ చేసిన సినిమాలన్నీ మంచి విజయాలు అందుకుంటున్నాయి. ఇక మహేశ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ మహేష్ కు విషెస్ చెప్పారు. మెగాస్టార్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.