
టిక్‌టాక్ స్టార్ సుబ్బలక్ష్మి అలియాస్ రౌడీ బేబీ ఆత్మహత్యాయత్నంకు యత్నించింది. త్రిస్సూర్‌లోని శబరి నగర్‌లో నివాసం ఉంటున్న సుబ్బలక్ష్మి తన ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
అయితే టిక్‌టాక్‌లో ఫేమస్ అయిన సుబ్బలక్ష్మి ఈ నెల16న సింగపూర్ నుంచి తమిళనాడుకు వచ్చింది. ఈ నేపథ్యంలో క్వారంటైన్‌లో ఉండేందుకు, పరీక్షలు చేయించుకునేందుకు ఆమె నిరాకరించింది. అంతేకాదు ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన పోలీసులతో పెద్ద పేచీనే పెట్టుకుంది. ఇక ఈ ఘటనకు చెందిన వీడియోను అక్కడి ఓ ప్రైవేట్ ఛానెల్ టెలికాస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆ న్యూస్‌ను ఇచ్చిన రిపోర్టర్‌ను హెచ్చరిస్తూ సుబ్బలక్ష్మి ఓ వీడియోను రిలీజ్ చేయగా.. దానిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రౌడీ బేబి ఆత్మహత్యాయత్నంకు యత్నించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Read This Story Also: రాజధానికి ఉగ్ర ముప్పు.. హై అలర్ట్..!