
తమిళ సూపర్ హిట్ సినిమా ‘జిగర్తండా’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ యంగ్ హీరో అధర్వ మురళీ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఇందులో హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డేను చిత్ర యూనిట్ ఎంపిక చేశారని సమాచారం.
ఈ సినిమా కోసం పూజా హెగ్డే 15 రోజులు తన డేట్స్ ను కేటాయించిందని తెలుస్తోంది. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.