పిట్ట కథలు టీజర్ రివ్యూ: నాలుగు విభిన్న కథలు.. డిఫరెంట్ ఎమోషన్స్.. ఒక్క సినిమా.!

Pitta Kathalu Teaser: నాలుగు విభిన్న కథలు.. నలుగురు దర్శకులు.. తీర్చిదిద్దిన సినిమా 'పిట్ట కథలు'. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమాను...

పిట్ట కథలు టీజర్ రివ్యూ: నాలుగు విభిన్న కథలు.. డిఫరెంట్ ఎమోషన్స్.. ఒక్క సినిమా.!
Pitta Kathalu Teaser

Updated on: Jan 20, 2021 | 12:22 PM

Pitta Kathalu Teaser: నాలుగు విభిన్న కథలు.. నలుగురు దర్శకులు.. తీర్చిదిద్దిన సినిమా ‘పిట్ట కథలు’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నుంచి వస్తోన్న తొలి తెలుగు సినిమా ఇదే. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదల అయింది.

నలుగురు మహిళలు జీవితాల్లోని ప్రేమ, సాన్నిహిత్యం, ద్రోహం వంటి భావోద్వేగాలు.. వాటికి, వారి నలుగురికి మధ్య కనక్షన్ ఏంటి అన్న పాయింట్‌పై సినిమాను బోల్డ్‌గా తెరకెక్కించారు. రిలీజ్ అయిన టీజర్‌లో కూడా అవి ప్రతిబింబిస్తాయి. తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక టీజర్‌లోని బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది.

ఈషా రెబ్బా, లక్ష్మీ మంచు, అమలా పాల్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అషిమా నార్వాల్, జగపతి బాబు, సత్య దేవ్, శాన్వి మేఘన, సంజిదా హెగ్డే ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌ఎస్‌వీపీ మూవీస్, ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ ‘పిట్ట కథలు’ సినిమా ఫిబ్రవరి 19వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.