‘ఆర్ఆర్ఆర్’ ఫ్లాప్ అయితే సినీ ఇండస్ట్రీలో పండుగ చేసుకుంటారు: వర్మ

| Edited By:

Jun 06, 2020 | 10:14 PM

ఆర్ఆర్ఆర్ ఫ్లాప్ అయితే సినీ ఇండస్ట్రీలో చాలా మంది పండుగ చేసుకుంటారని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్ఆర్ఆర్ ఫ్లాప్ అయితే సినీ ఇండస్ట్రీలో పండుగ చేసుకుంటారు: వర్మ
Follow us on

‘ఆర్ఆర్ఆర్’ ఫ్లాప్ అయితే సినీ ఇండస్ట్రీలో చాలా మంది పండుగ చేసుకుంటారని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వర్మ.. ”ఇండస్ట్రీలో ఎప్పుడూ ఐకమత్యం ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కాంపిటేటర్‌గానే ఫీల్ అవుతుంటారు. నిజానికి చెప్పాలంటే వెబ్‌సైట్‌లు ఇచ్చే నెగిటివ్ రివ్యూలను సినిమా ఇండస్ట్రీ వాళ్లే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా ఫ్లాప్‌ల్లో ఉన్నప్పుడు పక్కనున్న వాళ్లు చాలా సంతోషడతారు. సాధారణంగా మానవ లక్షణమే అది. ఏ ఇండస్ట్రీలోనైనా ఇలానే ఉంటుంది. ఒకవేళ ఆర్ఆర్ఆర్ ఫ్లాఫ్‌ అయితే రోడ్ల మీదికి వచ్చి డ్యాన్స్‌ చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. రాజమౌళిపై అలాంటి అసూయ చాలా మందికి ఉంది” అని అన్నారు.

కాగా రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్నారు. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాహుబలి బ్లాక్‌ బస్టర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!