‘అంధాధున్’ రీమేక్‌.. తమన్నాకు క్రేజీ రెమ్యునరేషన్‌..!

'అంధాధున్' తెలుగు రీమేక్‌కి పనులు వేగవంతం అయ్యాయి. నితిన్ హీరోగా తెరకెక్కబోయే ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.

అంధాధున్ రీమేక్‌.. తమన్నాకు క్రేజీ రెమ్యునరేషన్‌..!

Edited By:

Updated on: Sep 21, 2020 | 4:46 PM

Tamannaah Remuneration News: ‘అంధాధున్’ తెలుగు రీమేక్‌కి పనులు వేగవంతం అయ్యాయి. నితిన్ హీరోగా తెరకెక్కబోయే ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ రీమేక్‌లో టబు పాత్రలో తమన్నా, రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్‌ నటిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోన్న ఈ మూవీకి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించనున్నారు. నవంబర్‌ నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

కాగా ఈ మూవీలో తమన్నా పాత్ర బోల్డ్‌గా కాస్త నెగిటివ్ టచ్‌తో ఉంటుంది. ఇక ఈ పాత్ర కోసం మిల్కీ బ్యూటీకి క్రేజీ రెమ్యునరేషన్ ముట్టినట్లు తెలుస్తోంది. రూ.1.5కోట్లను నిర్మాతలు తమన్నాకు ఇచ్చినట్లు సమాచారం. అయితే హిందీలో ఈ పాత్రను టబు చాలా ఈజ్‌తో చేశారు. ఆమెను అనుసరించకుండా ఈ పాత్రను చేయడాన్ని తమన్నా సవాల్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ పాత్ర కోసం తమన్నా వర్కౌట్‌ కూడా చేస్తున్నట్లు సమాచారం.

Read more:

టీచర్ ఆవేదన.. ఏడ్చేసిన మధుమిత

ప్రభాస్ కోసం లెజండరీ దర్శకుడు.. ఏడు సంవత్సరాల తరువాత రీఎంట్రీ