Vakeel Saab Satellite Rights : భారీ ధరకు అమ్ముడైన వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్.. పవన్ స్టామినా ఇది అంటున్న ఫ్యాన్స్

హిట్ ప్లాప్ లతో సంబంధంలేని క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గత ఎన్నికల ముందు అజ్ఞాతవాసిలో నటించిన పవన్ చాలా గ్యాప్ తీసుకుని నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ సూపర్ మూవీ..

Vakeel Saab Satellite Rights : భారీ ధరకు అమ్ముడైన వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్.. పవన్ స్టామినా ఇది అంటున్న ఫ్యాన్స్

Updated on: Jan 15, 2021 | 2:14 PM

Vakeel Saab Satellite Rights :హిట్ ప్లాప్ లతో సంబంధంలేని క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గత ఎన్నికల ముందు అజ్ఞాతవాసిలో నటించిన పవన్ చాలా గ్యాప్ తీసుకుని నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ సూపర్ మూవీ పింక్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా టీజర్ సంక్రాంతి కానుకగా విడుదలైంది. పవన్ కళ్యాణ్ కోర్టు సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ తో కట్ అయ్యిన టీజర్ రికార్డ్స్ సునామీ సృష్టిస్తుంది.  కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ కూడా ఆలస్యమైంది. దీంతో వేసవి వినోదంగా వకీల్ సాబ్ రానుంది. ఓ వైపు థియేట్రికల్ రైట్స్ భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండగా.. ఇటీవలే శాటిలైట్ రైట్స్ కూడా క్లోజ్ అయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. రూ. 15 కోట్లకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయని ఫిల్మ్ నగర్ లో టాక్. మరోవైపు డిజిటల్ రైట్స్ కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొందని.. ఇదీ పవన్ స్టామినా అంటున్నారు.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మగువ సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. డిజిటల్ రైట్స్ డీల్ కూడా చర్చల దశల్లో ఉందని తెలుస్తుంది.  పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. నివేదా థామస్, అంజలి కీలక పాత్రలో కనిపించనున్నారు.

Also Read: సినీ నటి, ఎమ్మెల్యే రోజా ఇంట వైభవంగా సంక్రాంతి సంబరాలు.. కనుమనాడు ఆవుని పూజించిన రోజా