Anasuya Special Song : పైన పటారం లోన లొటారం.. వినరా చెబుతా లోకం తీరు అంటున్న యాంకర్ అనసూయ

|

Feb 27, 2021 | 6:21 PM

ఓ బుల్లితెర మీద రాణిస్తూనే వెండి తెరపై తళుక్కున మెరిసే భామ అందాల అనసూయ. ఓ వైపు యాంక‌ర్‌గా అల‌రిస్తూనే  మరోవైపు సినిమాల్లో అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ...

Anasuya Special Song : పైన పటారం లోన లొటారం.. వినరా చెబుతా లోకం తీరు అంటున్న యాంకర్ అనసూయ
Follow us on

Anasuya Special Song : ఓ బుల్లితెర మీద రాణిస్తూనే వెండి తెరపై తళుక్కున మెరిసే భామ అందాల అనసూయ. ఓ వైపు యాంక‌ర్‌గా అల‌రిస్తూనే  మరోవైపు సినిమాల్లో అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ బిజీబిజీగా ఉంది. అనసూయ నటిస్తూనే స్పెషల్ సాంగ్స్ లో నర్తిస్తుంది. తాజాగా ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ హీరోగా నటిస్తున్న చావుకబురు చల్లగా సినిమాలో యాంకర్ అనసూయ భరద్వాజ్ ఓ స్పెషల్ సాంగ్ తో అలరించడానికి రెడీ అయ్యింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పైనపటారం..ఈడ లోన లొటారం..విను బాసు చెబతాను లోకం వయ్యారం.. అంటూ సాగుతున్న ఈ సాంగ్‌లో అనసూయ ఫుల్‌ అవుడ్ అండ్ అవుట్ మాస్ స్టెప్పులతో అదరగొట్టింది.

ఇప్పటికే క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న అనసూయ.. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ కుర్రకారుని ఓ రేంజ్ లో ఉర్రుతలూగిస్తుంది. రవితేజ ‘క్రాక్’ మూవీ సక్సెస్ తరువాత నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ఆఫర్‌ కొట్టేసింది. లేడి ఓరియెంటెడ్‌ మూవీలకు సైతం ఓకే చెబుతున్న అనసూయ తాజాగా ఖిలాడీ మూవీకి ఓకే చెప్పేసింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అనసూయ కనిపించనుంది.

చావుకబురు చల్లగా సినిమాలో బస్తీ బాలరాజు పాత్రలో మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్‌గా కార్తికేయ, నర్సుగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి ఫస్ట్ లుక్స్ కు మంచి స్పందన లభించింది.

టాలీవుడ్ లో ఆర్ఎక్స్ 100 తో ఎంట్రీ ఇచ్చి యూత్‌ను ఆకట్టుకున్నాడు.. యంగ్ హీరో కార్తికేయ. తర్వాత చేసిన గుణ 369, 90 ఎంఎల్, హిప్పీ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా చావుకబురు చల్లగా’ అనే సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read:

సోషల్ మీడియా మీద ఉక్కుపాదం దేనికి? ఇప్పటికే ఐటీ చట్టం ఉండగా అంత అవసరమా? అసలీ కొత్త చట్టంలో ఏముంది?