నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ షో మొదటి ఎపిసోడ్లో టీడీపీ అధినేత చంద్రబాబు.. నారా లోకేష్ పాల్గొన్నారు. వీరిద్దరితో కలిసి బాలయ్య చేసిన సందడికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ విషయాలే కాకుండా… పొలిటికల్ టాపిక్స్ గురించి మాట్లాడడమే కాకుండా.. తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ.. ప్రేక్షకులకు మరింత వినోదం అందించారు బాలయ్య. మొదటిసారి ఓ టాక్ షో వేదికగా బాలయ్యతో కలిసి చంద్రబాబు, నారా లోకేష్ పాల్గొనడంతో అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ఊహించినదానికంటే ఎక్కువ హిట్ అయ్యింది.
అయితే గత సీజన్లో అంతా సినీ ప్రముఖులు రాగా.. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌లోనే నారా చంద్రబాబు, లోకేష్ పాల్గొనడంతో.. రెండో ఎపిసోడ్ కు వచ్చే సెలబ్రెటీ ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సినీ ప్రముఖులు వస్తారా ? లేదా రాజకీయ ప్రముఖులు వస్తారా ? అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్స్.. ఈ క్రమంలో సెకండ్ ఎపిసోడ్ గెస్ట్స్ ఎవరో అధికారికంగా చెప్పేసింది ఆహా.
అన్‌స్టాపబుల్ సీజన్ 2 సెకండ్ ఎపిసోడ్ కోసం.. బాలయ్యతో కలిసి మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు వస్తున్నారు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ. వీరిద్దరికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ.. దమ్దార్ దాస్, పగ్లా టిల్లు మీట్ తేడా సింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఆహా. సెన్సెషనల్ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత రాబోయే క్రేజీ ఎపిసోడ్ కోసం సిద్ధంగా ఉండండి. ఈ శుక్రవారం ఎంటర్టైన్మెంట్ వేరేలెవల్ లో ఉండబోతుంది. ఈ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో ఆదివారం ఉదయం 11 గంటలకు రాబోతుందంటూ రాసుకొచ్చింది ఆహా. ఇక విశ్వక్ సేన్, డిజే టిల్లు కలిసి బాలయ్యతో చేసే అల్లరి కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
After a sensational first episode, Get ready for a crazyyyyyy episodeeeeee! Raasi pettukondi ee Friday entertainment vere level lo undabothundhi!??
Promo out at 11am.#UnstoppableWithNBKS2#NandamuriBalakrishna pic.twitter.com/ixQvEtfGXI— ahavideoin (@ahavideoIN) October 16, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.