
మెగా ఇంట పెళ్లి సందడి ముగిసింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు హజరయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నితిన్ వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇక పెళ్లికి రాలేకపోయిన టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం నవంబర్ 5న హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ హాల్లో రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వెంకటేష్, అడివి శేష్, కార్తికేయ, అలీ, తేజ సజ్జా, కార్తికేయ, నవీన్ చంద్ర వీరి రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు.
ప్రస్తుతం వరుణ్, లావణ్య పెళ్లి వీడియో గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం వీరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ వీడియో స్ట్రీమింగ్ రైట్స్ మొత్తాన్ని ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ.8 కోట్ల భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ జంట వివాహ క్షణాలను చూసేందుకు అభిమానులు ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీని గురించి నెట్‌ఫ్లిక్స్ లేదా వరుణ్ లావణ్య నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 2017 నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థంతో తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు.
#Netflix bagged #VarunLav‘s wedding for 8cr. #VarunTej #VarunLavanya #LavanyaTripathi #VarunLavanyaWedding #Chiranjeevi #NagaBabu #RamCharan #PawanKalyan #AlluArjun pic.twitter.com/1loAfraXgN
— Crazy Buff (@CrazyBuffOffl) November 6, 2023
పెళ్లికి ముందే హైదారాబాద్ లో మెగాస్టార్, అల్లు అర్జున్ నివాసాలలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ జరిగాయి. ఇక ఇటలీలోని టుస్కానీలో అక్టోబర్ 30 నుంచి పెళ్లి వేడుకలు షూరు అయ్యాయి. ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మట్కా చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో వరుణ్ జోడిగా మీనాక్షి చౌదరి నటించనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు.
.#VarunLav Wedding Reception @VenkyMama #VictoryVenkatesh pic.twitter.com/w7LneTIG7T
— BA Raju’s Team (@baraju_SuperHit) November 5, 2023
.#VarunLav Wedding Reception @AshwiniDuttCh @vamsi84 @peoplemediafcy @BSaiSreenivas pic.twitter.com/qtuTh93QoS
— BA Raju’s Team (@baraju_SuperHit) November 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.