OTT Movie: ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో సంచలనం

కొన్ని రోజుల క్రితమే ఈ తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఉత్కంఠభరిత సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సిరీస్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థనే అధికారికంగా ప్రకటించింది.

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో సంచలనం
Nayanam Web Series

Updated on: Feb 08, 2026 | 8:39 PM

ఓటీటీలో ఓ తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. కొన్ని రోజుల క్రితమే ఈ సిరీస్ డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేసింది. అప్పటి నుంచి ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డిజిటల్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ భరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. ఈ సిరీస్ కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది నయన్ అనే ఓ కళ్ల డాక్టర్ కథ. కళ్ల సమస్యలు ఉన్న పేషెంట్లకు తన క్లినిక్ లో చికిత్స అందిస్తుంటాడు. ఇదే క్రమంలో తాను ప్రత్యేకంగా డిజైన్ చేసిన కళ్ల అద్దాలతో అవతలి వాళ్లు ఏం చేస్తున్నారనేది నాలుగు నిమిషాల పాటు చూడగలడు ఈ వైద్యుడు. సీక్రెట్ గా తన దగ్గర ఉన్న ఓ స్పెషల్ కళ్లద్దాల ద్వారా తన దగ్గరకు వచ్చే పేషెంట్ల అద్దాలకు ఉన్న లెన్స్ తో నాలుగు నిమిషాల పాటు వాళ్లు చూసేది డాక్టర్ కూడా చూడగలడు. అలాంటి డాక్టర్ దగ్గరకు మాధవి అనే మహిళ వస్తుంది. ఆమెను చూసి మనసు పారేసుకుంటాడు నయన్. కానీ అప్పటికే ఆమెకు పెళ్లయిఉంటుది. ఇదే క్రమంలోనే ఉన్నట్లుండి మాధవి భర్త చనిపోతాడు. ఈ హత్య చేసింది ఎవరు అని కనిపెట్టేందుకు ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతాడు. మరి మాధవి భర్తను ఎవరు చంపారు? అందులో డాక్టర్ నయన్, మాధవిల ప్రమేయం ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.

ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగే ఈ సిరీస్ పేరు నయనం. హీరోగా వరుస ఫ్లాప్ లు ఎదుర్కొన్న వరుణ్ సందేశ్ ఈ వెబ్ సిరీస్ తోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో అతను కళ్ల డాక్టర్ నయన్ పాత్రలో అదరగొట్టాడు. అతనితో పాటు ఉత్తేజ్, బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్, అలీ రెజా తదితరులు ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు నటించారు. గతేడాది డిసెంబర్ 19న జీ5 ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చేసిన ఈ సిరీస్ ఇప్పుడు 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఓటీటీలో నయనం రికార్డు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.