Cinema: మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీలో ఒక సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. అది కేవలం నేరంపైనే కాకుండా.. ఏ విధంగానైనా తన కొడుకును చేరుకోవాలన్నా ఒక తండ్రి పట్టుదల గురించి తెలియజేస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్ ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పుడు అందరూ ఈ సిరీస్ గురించే మాట్లాడుకుంటున్నారు.

Cinema: మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..
I Will Find You Series

Updated on: Jun 26, 2026 | 7:43 AM

ఒక నవల ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. అంతేకాదు.. విడుదలైన ఒక్క రాత్రిలోనే ఈ సిరీస్ అగ్ర స్థానానికి చేరుకుంది. ఇప్పుడు ఇది చాలా మంది ‘తప్పక చూడాల్సిన’ జాబితాలో ఉంది. కేవలం నాలుగు రోజుల్లోనే, ఈ కొత్త సిరీస్ ఎన్నో అగ్రశ్రేణి థ్రిల్లర్ సిరీస్‌లను అధిగమించి ట్రెండింగ్ జాబితాలో నంబర్ వన్ స్థాయికి చేరింది. ఇది ఒక పరిమిత క్రైమ్ డ్రామా సిరీస్, దీనికి IMDbలో కూడా మంచి రేటింగ్‌లు లభించాయి. ఈ ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్ విదేశాలలోనే కాకుండా భారతదేశంలో కూడా చాలా దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సిరీస్ స్టాండ్-అప్ కమెడియన్ సమయ్ రైనా ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ రెండవ సీజన్‌ను కూడా అధిగమించింది. ఈ మినీ-సిరీస్ పేరు ‘ఐ విల్ ఫైండ్ యు’. ఈ సిరీస్ హర్లాన్ కోబెన్ రచించిన అదే పేరు గల బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా రూపొందించబడింది.

హార్లన్ కోబెన్ ఈ సిరీస్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించగా.. ఇందులో సామ్ వర్తింగ్‌టన్, బ్రిట్ లోవర్, మైలో వెంటిమిగ్లియా, ఎరిన్ రిచర్డ్స్ నటించారు. తన కొడుకును హత్య చేశాడని ఆరోపించబడిన ఒక తండ్రి కథను ఈ సిరీస్ చెబుతుంది. ఆ హత్యకు గాను ఆ తండ్రికి జైలు శిక్ష పడుతుంది. జైలులో ఉన్న ఒక తండ్రికి తన కొడుకు ఎక్కడో బతికే ఉన్నాడని అనిపిస్తుంది. అందుకే, జైలు నుండి బయటకు రాగానే తన కొడుకును వెతకడానికి బయలుదేరతాడు. కానీ ఈ ప్రమాదకరమైన ప్రయాణంలో, అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసే కొన్ని రహస్యాలు అతనికి ఎదురవుతాయి. ఈ సిరీస్ జూన్ 18న ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అయిన వెంటనే ఈ వెబ్ సిరీస్ టాప్ ట్రెండింగ్ జాబితాలో రెండవ స్థానానికి చేరుకుంది. ఈ వెబ్ సిరీస్ ‘టీచ్ యు ఎ లెసన్’ , ‘ఇండియాస్ గాట్ టాలెంట్ 2’లను అధిగమించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు IMDbలో పదికి 7.3 రేటింగ్ లభించింది. ఎనిమిది ఎపిసోడ్‌లు గల ఈ మినీ-సిరీస్ నిడివి గంట కంటే తక్కువ. ప్రస్తుతం ఈ సిరీస్ దూసుకుపోతుంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..

Follow Us