
వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతి ఒక్కరూ సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అందుకే ఈ వారాంతంలో ఏ సినిమా చూడాలి..? ఏ సిరీస్ చూడాలనే విషయంలో సినిమా అభిమానులలో ఎప్పుడూ గందరగోళం ఉంటుంది. అందుకే ఇప్పుడు మీ ముందుకు మూడు ఇంట్రెస్టింగ్ సినిమాలు తీసుకువచ్చాం. బ్లాస్ట్: సుభాష్ కె రాజ్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ ‘బ్లాస్ట్’ చిత్రంలో అర్జున్, అభిరామి , ప్రీతి ముకుందన్ నటించారు. మే 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇది రూ. 70 కోట్ల వసూళ్లను సాధించినట్లు సమాచారం. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడని చాలా మంది ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
అవతార్: ఫైర్ అండ్ యాష్ (జియోహాట్‌స్టార్): ఆస్కార్ పురస్కారం అందుకున్న దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 24న విడుదల అయ్యింది. సామ్ వర్తింగ్‌టన్ , జో సల్దానా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం, నెక్‌డేయామ్‌ను కోల్పోయిన తర్వాత ‘యాష్ పీపుల్’ అనే కొత్త, దూకుడు స్వభావం గల నావి తెగను ఎదుర్కొనే జేక్ కుటుంబం కథను అనుసరిస్తుంది. ఇది పండోరా ప్రపంచంలోని ఒక కొత్త కోణాన్ని , ప్రతీకారం కోసం జరిగే పోరాటాన్ని ప్రదర్శిస్తుంది.
డ్రిడమ్: మార్టిన్ జోసెఫ్ దర్శకత్వంలో, షేన్ నిగమ్ నటించిన మలయాళ చిత్రం ‘డ్రిడమ్’ ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రం జియో హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది. కొత్త పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన షేన్ నిగమ్, హత్య కేసులను దర్యాప్తు చేస్తాడు. అతను నేరస్థుడిని ఎదుర్కొన్నప్పుడు చివరికి ఏమి జరుగుతుందనేదే ఈ కథ. ఈ చిత్రం ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది.
లింగం: లక్ష్మీ శరవణకుమార్ దర్శకత్వం వహించిన ‘లింగం’ ఒక తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో కతిర్, దివ్య భారతి , లాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ రేపు (జూన్ 26) జియో హాట్‌స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. ఒక కబడ్డీ ఆటగాడు ఎలా డాన్‌గా మారాడనేది ఈ సిరీస్ కథాంశం. ఇక మరోక సినిమా రాక్: ఇది సిరీస్ ముంబైలో జరిగిన ఒక నిజమైన నేర సంఘటన ఆధారంగా రూపొందించబడింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సిరీస్‌ను ఉత్కంఠభరితమైన , హృదయవిదారకమైన సన్నివేశాలతో రూపొందించారు. ఇది కుటుంబంతో కలిసి చూడటానికి తగినది కాదు.
ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..
ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..