హారర్ సినిమాలు చూడాలని చాలా మంది ఆసక్తి ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త హారర్ కథా చిత్రాలను చూసేందుకు ఎదురుచూస్తుంటారు. ఎప్పుడెప్పుడు అలాంటి సినిమాలు విడుదలవుతాయా అని వెయిట్ చేస్తుంటారు హారర్ సినీ ప్రియులు. ఇటీవల ప్రేక్షకులను భయంతో పరిగెత్తించే సస్పెన్స్ థ్రిల్లింగ్ హారర్ చిత్రాలను రూపొందించేందుకు అటు మేకర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొన్ని రోజులుగా వరుసగా ఇలాంటి దెయ్యాల కథలు ఓటీటీలోకి వస్తున్నాయి. ఎప్పుడూ హారర్, దెయ్యాల చిత్రాలను ఇష్టపడే వారి కోసం ఇప్పుడు మరో సినిమాను తీసుకువచ్చారు మేకర్స్. అదే ది ఫస్ట్ ఒమెన్. ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ ఒమెన్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు మొత్తం ఐదు సినిమాలు వచ్చాయి.
ది ఒమెన్ (1976), డామెయిన్-ఒమెన్ 2 (1978), ద ఫైనల్ కాన్ ఫ్లిక్ట్ (1981), ఒమెన్ 4 ద అవేక్నింగ్ (1991), ది ఒమెన్ (2006) చిత్రాలు మంచి రివ్యూస్ అందుకున్నాయి. కాగా ఇప్పుడు ది ఒమెన్(2006) ప్రీక్వెల్ గా ది ఫస్ట్ ఒమెన్ (2024) సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఇద 1971లో జరిగిన కథను చూపిస్తుంది. అంటే 1976 హారర్ క్లాసిక్ ది ఒమెన్ మూవీకి ముందు ఐదు సంవత్సరాల ముందు కథతో వస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమా మే 30 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. ఆర్కష స్టీవెన్ సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాఫఈక్ బర్హోమ్, సోనియా బ్రాగ, నెల్ టైగర్ ఫ్రీ, బిల్ నైయ్, రాల్ఫ్ ఇనెసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక మంచి హారర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అడియన్స్ ఇప్పుడు ఈ ది ఫస్ట్ ఒమెన్ సినిమాను హాట్ స్టార్ లో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.
From service to survival. Brace yourself for a chilling mystery.#TheFirstOmen streaming 30th May on #DisneyPlusHotstar pic.twitter.com/0GTsn66z9O
— Disney+ Hotstar (@DisneyPlusHS) May 18, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.