Kalyanam Kamaneeyam: ఓటీటీలోకి సంతోష్ శోభన్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ .. కల్యాణం కమనీయం స్ట్రీమింగ్‌ డేట్ ఇదే

|

Feb 05, 2023 | 3:24 PM

న‌మ్మకం, ప్రేమ ఉన్నప్పుడే పెళ్లి బంధం నిల‌బ‌డుతుంద‌న్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగానే ఆకట్టుకుంది. అయితే వాల్తేర్ వీర‌య్య, వీర‌సింహారెడ్డి పోటీలో ఉండడంతో బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌గా సరిపెట్టుకుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన కల్యాణం కమనీయం సినిమా ఇప్పుడు డిజిటిల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Kalyanam Kamaneeyam: ఓటీటీలోకి సంతోష్ శోభన్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ .. కల్యాణం కమనీయం స్ట్రీమింగ్‌ డేట్ ఇదే
Kalyanam Kamaneeyam Ott
Follow us on

యంగ్ హీరో సంతోష్‌ శోభన్‌, లేటెస్ట్‌ సెన్సేషన్‌ ప్రియా భవాణి శంకర్‌ జంటగా నటించిన చిత్రం కల్యాణం కమనీయం. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వ‌హించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మిక్స్‌డ్‌టాక్‌ సొంతం చేసుకుంది. న‌మ్మకం, ప్రేమ ఉన్నప్పుడే పెళ్లి బంధం నిల‌బ‌డుతుంద‌న్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగానే ఆకట్టుకుంది. అయితే వాల్తేర్ వీర‌య్య, వీర‌సింహారెడ్డి పోటీలో ఉండడంతో బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌గా సరిపెట్టుకుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన కల్యాణం కమనీయం సినిమా ఇప్పుడు డిజిటిల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. సినిమా విడుదలై నెలరోజులు పూర్తి కావొస్తుండడంతో ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేసేందుకు మూవీ మేకర్స్‌ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

కల్యాణం కమనీయం సినిమాలో శివ అనే నిరుద్యోగిగా సంతోష్ శోభ‌న్ క‌నిపించ‌గా శృతి అనే సాప్ట్‌వేర్ ఉద్యోగిగా ప్రియా భ‌వానీ శంక‌ర్ న‌టించింది. అలాగే కేదార్ శంకర్, దేవి ప్రసాద్, సప్తగిరి, జబర్దస్త్‌ సద్దాం తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రావణ్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. సత్య జి ఎడిటర్‌గా వ్యవహరించారు. యూత్‌ను బాగా ఆకట్టుకున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ను థియేటర్లలో చూడలేనివారు ఎంచెక్కా ఆహాలో చూసి ఎంజాయ్‌ చేయండి.