Cinema : అమ్మాయి కిడ్నాప్ చుట్టూ సస్పెన్స్ స్టోరీ.. ఊహించని మలుపులు.. ఓటీటీలోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్..

ఓటీటీలోకి నిత్యం కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు వస్తుంటాయి. ముఖ్యంగా సస్పెన్స్, మిస్టరీ సినిమాలు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం తమిళంలో వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై కేవలం నెల రోజులు మాత్రమే అవుతుంది. కానీ అంతలోనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఈ సినిమా వివరాలెంటో తెలుసుకోండి.

Cinema : అమ్మాయి కిడ్నాప్ చుట్టూ సస్పెన్స్ స్టోరీ.. ఊహించని మలుపులు.. ఓటీటీలోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్..
Blackmail Movie

Updated on: Oct 24, 2025 | 9:12 AM

ప్రస్తుతం ఓటీటీలోకి ఓ కొత్త సినిమా రాబోతుంది. గత నెల రోజులుగా థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి రానుంది. అదే బ్లాక్ మెయిల్. గత సెప్టెంబర్ 12న తమిళంలో విడుదలైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా.. ఒక అమ్మాయి కిడ్నాప్ చుట్టూ తిరుగుతుంది. అలాగే ఆద్యంతం ఉత్కంఠ, ఊహించని మలుపులతో ఈ సినిమా సాగుతుంది. థ్రిల్లింగ్ అంశాలతోపాటు భావోద్వేగ క్షణాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమా నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?

ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, శ్రీరామ్, బింధుమాధవి, తేజు అశ్విని ప్రధాన పాత్రలలో నటించగా.. మారన్ దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో జీవి ప్రకాష్ మణి అనే పాత్రలో నటించారు. ఈ సినిమాకు IMDBలో 8.5 రేటింగ్ ఉంది. రహస్యం ఎంత లోతుగ ఉంటే అంత గట్టిగా ప్రతిధ్వనిస్తుంది అంటూ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్ సైతం ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?

సినిమా కథ విషయానికి వస్తే.. బ్లాక్ మెయిల్ సినిమా ఒక అమ్మాయి కిడ్నాప్ చుట్టూ తిరుగుతుంది. ఒక చిన్న అమ్మాయి కిడ్నాప్‌కు గురయ్యే స్టోరీ ఇది. మణి (జీవి ప్రకాష్) ఫార్మాసూటికల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర పనిచేస్తుంటాడు. కానీ అతడికి సీక్రెట్ గా కొకైన బిజినెస్ ఉంటుంది. అతడికి రేఖ (తేజు అశ్విని) అనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఫార్మసీలో పనిచేసి ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. మరోవైపు అశోక్ (శ్రీరామ్ ) కూతురు కిడ్నాప్ అవుతుంది. మరోవైపు అర్చన (బింధుమాధవి ) మాజీ లవర్ ఆమెను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. వీళ్లందరి జీవితాలు ఒక చోటుకు ఎలా వస్తాయి.. ? అసలు వీరిందరి జీవితాల్లో ఏం జరిగింది అనేది సినిమా.

ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..

 

ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..