ఓవైపు థియేటర్లలో సూపర్ హిట్ చిత్రాలు అలరిస్తున్నా.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు ఆదరణ మాత్రం తగ్గడం లేదు. హిట్ చిత్రాలు.. సరికొత్త కంటెంట్ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అనేక చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరో సినిమా అందుబాటులోకి వచ్చేసింది. టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన లేటేస్ట్ చిత్రం మామా మశ్చీంద్ర. ఇందులో ఈషా రెబ్బా, మిర్నాలిని రవి హీరోయిన్లుగా నటించారు. డైరెక్టర్ హర్షవర్దన్ తెరకెక్కించిన ఈ సినిమాలో సుధీర్ మూడు విభిన్న పాత్రలలో కనిపించారు. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కామెడీ పరంగా మెప్పించినప్పటికీ ఊహించిన స్తాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థలు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ కామెడీ ఎంటర్టైనర్ ను థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూసి ఆనందించవచ్చు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నిర్మించారు.
ఇక కథ విషయానికి వస్తే..
పరశురామ్ (సుధీర్ బాబు)కి చాలా స్వార్థం ఉంటుంది. కోట్ల ఆస్తి కోసం తన సొంత చెల్లి కుటుంబాన్ని చంపాలని ప్లాన్ చేస్తాడు. కానీ వాళ్లు బతికిపోతారు. పరశురామ్ కూతురు విశాలాక్షి (ఈషారెబ్బా), దాసు కూతురు మీనాక్షి (మృణాళిని రవి) తమ మేనత్త కుమారులతో (సుధీర్ బాబు డబుల్ రోల్) ప్రేమలో పడతారు. వీరిద్దరూ పరశురామ్ పోలికలతో ఉంటారు. తన కూతుర్లు తన మేనల్లుడ్లతోనే ప్రేమలో ఉన్నారనే నిజం తెలుసుకుంటాడు పరశురామ్. ఆ తర్వాత వీరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది స్టోరీ. ఇప్పుడు ఈ కామెడీ ఎంటర్టైనర్ అమెజాన్ ప్రైమ్, ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
Prema, Kopam unna chota polikalu chudaru ❤️💕
Witness the funny, emotional Family ‘Packed’ Hit #MaamaMascheendra ❤️🔥
IN CINEMAS NOW 🎥
🎟️ https://t.co/utELP9NsnL@isudheerbabu @HARSHAzoomout @YoursEesha @mirnaliniravi @SVCLLP #SrishtiCelluloids @adityamusic pic.twitter.com/lryf7p9EW3
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) October 10, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.