Harom Hara OTT: హరోం హర ఓటీటీ స్ట్రీమింగ్ కొత్త డేట్.. ఎప్పుడు ఎక్కడ రిలీజ్ కానుందంటే..

|

Jul 14, 2024 | 10:42 AM

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత జీ నాయడు నిర్మించిన ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్‍తో ఆకట్టుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఈనెలలో ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ ఆఖరి నిమిషాల్లో వాయిదా పడింది.

Harom Hara OTT: హరోం హర ఓటీటీ స్ట్రీమింగ్ కొత్త డేట్.. ఎప్పుడు ఎక్కడ రిలీజ్ కానుందంటే..
Sudheer Babu Harom Hara Movie
Follow us on

విలక్షణ నటుడు సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా హరోం హర. చిత్తూరు బ్యాక్ డ్యాప్ లో డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 14న థియేటర్లో విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చిన ఈసినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 7 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇందులో సుధీర్ సరసన మాళవిక శర్మ నటించగా.. సునీల్ కీలకపాత్ర పోషించాడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత జీ నాయడు నిర్మించిన ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్‍తో ఆకట్టుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఈనెలలో ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ ఆఖరి నిమిషాల్లో వాయిదా పడింది.

జూన్ 11న ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్, ఆహా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ ఆఖరి నిమిషంలో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా కొత్త తేదీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ వెల్లడించింది. ఈ సినిమాను జూలై 18న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్ కూడా షేర్ చేసింది. అలాగే అహాలోనూ జూలై 18న ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఆహా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే ఆహా నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

అయితే ఓటీటీల్లో హరోం హర స్ట్రీమింగ్ వాయిదా పడటానికి బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన ప్రణీత్ హనుమంతు వ్యవహారమే అని తెలుస్తోంది. ఎందుకంటే హరోం హర సినిమాలో ప్రణీత్ కీలకపాత్రలో నటించాడు. దీంతో అతడికి సంబంధించిన సీన్స్ కట్ చేసి ఓటీటీలో వేయను్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.