Hunt Movie: ఓటీటీలోకి సుధీర్ బాబు ‘హంట్’ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా ?..

అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లుగా టాకా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుందట ప్రైమ్ వీడియో.

Hunt Movie: ఓటీటీలోకి సుధీర్ బాబు హంట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా ?..
Hunt Movie

Updated on: Jan 31, 2023 | 2:29 PM

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. ఈ చిత్రానికి మహేష్‌ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీకాంత్, భరత్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో మెమరీ లాస్ అయిన అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ పాత్రలో సుధీర్ బాబు నటించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించకలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లుగా టాకా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుందట ప్రైమ్ వీడియో.

తాజా సమచారాం ప్రకారం ఫిబ్రవరి 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రతి చిత్రం దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సుధీర్ బాబు నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ చిత్రంలో మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, రవి వర్మ, ‘జెమినీ’ సురేష్ కీలకపాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us