హిందీలో బిగ్‌బాస్ రియాల్టీ షోకు మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు బుల్లితెరపై 17 సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ అయ్యాయి. దీంతో అటు ఓటీటీలోనూ బిగ్‌బాస్ షో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 3 నడుస్తోంది. అయితే తాజాగా బిగ్‌బాస్ హౌస్ లో ప్రేక్షకులు పామును గుర్తించారు. గార్డెన్ ఏరియాలో నేలపై నల్లటి పాము వెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హౌస్ లోకి పాము ఎలా వచ్చింది.. ? కంటెస్టెంట్స్ భద్రత కోసం నిర్వాహకులు తీసుకుంటున్న జాగ్రత్తలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆ వీడియోలో కంటెస్టెంట్ లవకేష్ కటారియా అకా లవ్ కటారియా సమీపంలోని పాము వెళ్తూ కనిపించింది. అయితే తన పక్కన నుంచి పాము వెళ్తున్నా అతడు చూసుకోకుండా అలాగే నేలపై కూర్చుని ఉన్నాడు. లవ్ కటారియా చేతులను సంకెళ్లతో కట్టేసి ఉండగా.. అతడి పక్కన నుంచే నల్లటి పాము వెళ్లింది. అయితే పాము వెళ్లడం అక్కడున్న ఏ కంటెస్టెంట్ కూడా పామును చూడకుండా తమ పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ షేర్ చేస్తూ బిగ్‌బాస్ హౌస్‌లో భద్రతా చర్యలపై అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Snake behind #LuvKataria on Bigg Boss.. What's going on with the safety measures?#BiggbossOTT3 #BiggBoss pic.twitter.com/I9qh5ZaJqT
— Biggboss Khabri (@BiggbossKaTadka) July 9, 2024
అయితే, వీడియో బయటకు వచ్చిన కొద్దిసేపటికే, జియో సినిమా బృందం ఆ క్లిప్ ఎడిట్ చేశారంటూ స్పష్టం చేసింది. హౌస్ లోకి పాము రాలేదని.. కేవలం అది ఎడిట్ చేసిన వీడియో మాత్రమే అని తెలిపారు. ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
The garden area blinds are closed, and everyone has been asked to get inside the house. Bigg Boss announced this 4-5 times, and now I think they’re taking action to find the snake. 👀#LuvKataria #ElvishYadav #BiggBossOTT3 pic.twitter.com/ovpt3Ew8eY
— Priya Vatsh (@Priyankavatsh) July 9, 2024
Fans claim they've seen the snake for real in the Live feed and have recorded the clip.
Meanwhile, a JioCinema member from the Bigg Boss team shared that they checked internally and found the video of the snake in the garden area, where Luv Kataria is handcuffed, to be doctored.…
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) July 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.