Bhairathi Ranagal OTT: ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

|

Dec 25, 2024 | 7:27 PM

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్నఆర్ సీ 16(వర్కింగ్ టైటిల్ ) సినిమాలో శివన్న కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

Bhairathi Ranagal OTT: ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Bhairathi Ranagal Movie
Follow us on

 

2024లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ‘భైరతి రణగల్’ కూడా ఒకటి. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇందులో హీరోగా నటించాడు. నవంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండు వారాల తర్వాత తెలుగులోనూ (నవంబర్ 30) విడుదలైన శివన్న సినిమా మంచి వసూళ్లనే సాధించింది. సిల్వర్ స్క్రీన్‌పై భైరతి రణగల్ సినిమా మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేసే సమయం వచ్చింది. అవును ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. భైరతి రణగల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ సొంతం చేసుకుంది. క్రిస్మస్ కానుకగా బుధవారం (డిసెంబర్ 25) అర్ధరాత్రి నుంచి శివన్న సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. కాగా మొదట ఈ మూవీ కన్నడతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ స్ట్రీమింగ్ కు రానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతానికి కేవలం కన్నడలో మాత్రమే భైరతి రణగల్ సినిమా అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది. నర్తన్ దర్శకత్వంలో తెరకెక్కిన త్రం ‘భైరతి రణగల్’ సినిమాలో శివరాజ్ కుమార్ సరసన సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించడం విశేషం.

 

2017లో వచ్చిన ‘మఫ్తీ’ చిత్రానికి ప్రీక్వెల్ గా ‘భైరతి రణగల్’ తెరకెక్కింది. నర్తన్, శివరాజ్‌కుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందరూ ఊహించిన విధంగానే ఈ సినిమా శివన్న అభిమానులను బాగా అలరించింది. ‘గీతా పిక్చర్స్’ బ్యానర్ పై శివన్న భార్య గీతా శివరాజ్‌కుమార్ ఈ సినిమాను నిర్మించారు. సినిమాకు కాసుల వర్షం కురవడంతో ఈ బ్యానర్ కు మంచి లాభాలే వచ్చాయి. ఇప్పుడు ఓటీటీలో చూస్తున్న ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

కాగా ఈ సినిమా పనులు ముగిసిన వెంటనే విదేశాలకు వెళ్లాలని శివరాజ్‌కుమార్ నిర్ణయించుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల శివన్నకు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు, కుటుంబ సభ్యులు తెలిపారు. శివన్న త్వరగా కోలుకుని రావాలని అందరూ ప్రార్థించారు. ఆయన కోసం చాలా చోట్ల పూజలు, హోమాలు చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.