OTT Movie: ఓటీటీని ఊపేస్తోన్న తెలుగు సినిమా.. తమిళ్, మలయాళం, కన్నడలోనూ ట్రెండింగ్ నంబర్ వన్.. IMDBలోనూ టాప్

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టింది. ఇక గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. తెలుగుతో సహా తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

OTT Movie: ఓటీటీని ఊపేస్తోన్న తెలుగు సినిమా.. తమిళ్, మలయాళం, కన్నడలోనూ ట్రెండింగ్ నంబర్ వన్.. IMDBలోనూ టాప్
OTT Movie

Updated on: Jul 20, 2026 | 8:40 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రానున్నాయి. టోవినో థామస్ పళ్లిచట్టంబి, దీవానా, కాన్ సిటీ వంటి సినిమాలతో పాటు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ బాల విద్యాలయ వంటి వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటి సంగతి పక్కన పెడితే.. గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ తెలుగు సినిమా దుమ్మురేపుతోంది. యాక్షన్ కు తోడు ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ సినిమా కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా యావత్ సౌత్ ఇండియా డిజిటల్ మార్కెట్‌ను శాసిస్తోంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ నాలుగు భాషల్లోనూ అత్యధిక వ్యూస్‌తో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోందీ తెలుగు సినిమా. ఒక సాధారణ గృహిణి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి చేసే పోరాటం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్ కు
పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా మారిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని డిజిటల్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతూ ఓటీటీని షేక్ చేస్తోన్న ఆ సినిమా మరేదో కాదు సమంత నటించిన మా ఇంటి బంగారం. థియేటర్లలో రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా జులై 17న జియో హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్ట్రీమింగ్ కు వచ్చిన రెండు రోజుల్లోనే ఈ మూవీ ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్లిపోయింది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ సామ్ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సమంతతో పాటు శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

జియో హాట్ స్టార్ లో సమంత మా ఇంటి బంగారం సినిమా..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us