
సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన మూడో సినిమా ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ భామ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజైన ఛాంపియన్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. పోటీలో శంభాలా వంటి చాలా సినిమాలున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. తెలంగాణలోని బైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఫుట్ బాల్ ఛాంపియన్ కావాలని కలలు కనే యువకుడి పాత్రలో రోషన్ యాక్టింగ్ అద్భుతమని ప్రశంసలు వచ్చాయి. అలాగే అనస్వర గ్లామర్ కు, అభినయానికి కూడా మంచి మార్కులే పడ్డాయి. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైందని సమాచారం. ఛాంపియన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంత చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23 నుంచి రోషన్ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్ సంయుక్తంగా ఛాంపియన్ సినిమాను నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఓ క్యామియో రోల్ లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అవంతిక ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. హీరో రోషన్ తో కలిసి సూపర్బ్ స్టెప్పులేసింది. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు ఛాంపియన్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ‘గిరగిర గింగిరాగిరే’ పాట యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొట్టింది.
This Champion’s game ignites more than passion. It sparks a revolution 🏆🔥#Champion, is coming soon to @NetflixIndia in Telugu, Tamil, Hindi, Malayalam and Kannada.#NetflixPandaga@Netflix_INSouth @IamRoshanMeka @PradeepAdvaitam #AnaswaraRajan @SwapnaCinema @AnandiArtsOffl… pic.twitter.com/3V4LfcQAcb
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 16, 2026
#Champion Premieres 23rd January on Netflix pic.twitter.com/U5Igratz9G
— Cinema Mania (@ursniresh) January 18, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి